బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆ భయం పట్టుకొంది: కెఈ కృష్ణమూర్తి
పీఎసీ చైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి భయం పట్టుకొందన్నారు డీప్యూటీ సీఎం కెఈ.తనను విమర్శించేస్థాయి బుగ్గనకు లేదన్నారు కెఈ.వచ్చే ఎన్నికల తర్వాత బుగ్గన మాజీ ఎమ్మెల్యే కావాల్సిందేనని చెప్పారు.
అమరావతి: పిఎసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి భయం పట్టుకొందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.గురువారంనాడు డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై కెఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను విమర్శించే స్ధాయి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి లేదని కెఈ చెప్పారు..తాను వచ్చే ఎన్నికల్లో నేను డోన్ నుంచి పోటీ చేస్తానని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి భయం పట్టుకుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

వచ్చే ఎన్నికల తర్వాత బుగ్గన మాజీ ఎమెల్యే కావాల్సిందేనని ఆయన అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా సూచనలు చేయకుడా చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
పీఎసీ ఛైర్మెన్‌గా తన విధులను సక్రమంగా నిర్వర్తించాలని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సూచించారు డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి. 2014 వరకు డోన్ అసెంబ్లీ స్థానం నుండి కెఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహించారు.












Click it and Unblock the Notifications