పుంగనూరు దాడులు టీడీపీ పనే ! చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరిక...

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన పేరుతో చేస్తున్న యాత్రల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు పెరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న పుంగనూరులో వైసీపీ,టీడీపీ మధ్య రాళ్ల దాడులు కూడా చోటు చేసుకున్నాయి. మధ్యలో పోలీసులపైనా పలువురు దాడి చేశారు. దీనిపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ తీవ్రంగా స్పందించారు.

పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన వారిని టీడీపీ కార్యకర్తలుగా గుర్తించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. పుంగనూరులో నిన్న చోటు చేసుకున్న ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. డీఐడీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ రెడ్డిని ఈ మేరకు దర్యాప్తు చేయాలని ఆదేశించామన్నారు. అలాగే టీడీపీ కార్యకర్తల దాడుల్లో పోలీసులు గాయపడినట్లు ఆయన నిర్ధారించారు. వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులబెట్టినట్లు డీజీపీ తెలిపారు.

ap dgp rajendranath reddy

పుంగనూరు ఘటనల్లో పోలీసుల వ్యవహారశైలితో పాటు టీడీపీ కార్యకర్తల దాడులపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుంగనూరు ఘటనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్విన వారందరినీ గుర్తించినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపైనా కఠిన చర్యలు తప్పవని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు.

అలాగే పుంగనూరులో నిన్న జరిగిన ఘటనలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. నిన్నటి ఘటనలకు కారకులుగా భావిస్తున్న 30 మంది టీడీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిలో వెంటనే దర్యాప్తు పూర్తి చేసి వారిని కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు రాయలసీమ టూర్ లో భాగంగా ఇవాళ శ్రీకాళహస్తిలోనూ టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు పుంగనూరు ఎపిసోడ్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+