Macherla Violence: మాచర్లలో హింస-విచారణకు డీజీపీ ఆదేశం-రంగంలోకి ఐజీ త్రివిక్రమ్ .. !
పల్నాడులోని మాచర్ల నియోజకవర్గం ఫ్యాక్షన్ హింసతో భగ్గుమంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య నిన్న రాత్రి మొదలైన హింస ఇవాళ కూడా పలు చోట్ల కొనసాగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసులు.. పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మిగతా ప్రాంతాల వారిని మాచర్ల రాకుండా అడ్డుకుంటున్నారు. హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు.
మాచర్ల ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి నుంచి చోటు చేసుకున్న ఘటనలపై విచారణకు ఐజీ త్రివిక్రమ వర్మను మాచర్లకు పంపారు. వైసీపీ, టీడీపీ శ్రేణులు రాడ్లు, బండ రాళ్లు, కర్రలతో స్వైరవిహారం చేసిన ఘటనపై డీజీపీ ఆరా తీశారు. అదనపు బలగాలను మాచర్లకు పంపినట్లు డీజీపీ ఇవాళ ప్రకటించారు. మాచర్లలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ పరిస్ధితులు కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మాచర్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయ పార్టీల కార్యకర్తల్ని హెచ్చరించారు. అవాంఛనీయ శక్తులను ఉపేక్షించబోమన్నారు. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు మాచర్లలో హింస ఆగినా ఉద్రిక్త పరిస్దితులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మాచర్ల వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారుు












Click it and Unblock the Notifications