మహిళా పోలీసులతో అంగన్‌వాడీ పనులా : పోలీసు పని మాత్రమే చేస్తారు : సీఎస్‌కు డీజీపీ సవాంగ్ లేఖ..!!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా రక్షణ కార్యదర్శుల వ్యవహారంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమించిన 15 వేల మందిని మహిళా పోలీసులుగా పరిగణించాలని ప్రభుత్వం జూన్ 23న ఈ ఆదేశాలు జారీ చేసింది. వీరికి పోలీసు శాఖ విడతల వారీగా శిక్షణ ప్రారంభించి ఇటీవలే యూనిఫామ్ సైతం ఇచ్చింది. ఏ వార్డు పోలీసు ఆ వార్డు, గ్రామ పరిధిలో మహిళల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించింది.

వార్డు మహిళా పోలీసు విధుల పైన
ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితురాలితో ఫిర్యాదు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. అయితే, తాజాగా వీరితో నిర్వహిస్తున్న విధుల పైన డీజీపీ సవాంగ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. పోలీసు శాఖ పరిధిలోకి వచ్చిన సిబ్బందితో అంగన్ వాడీ పనులు ..ఇతరత్రా విధులు ఎలా కేటాయిస్తారంటూ ఆయన ఆ లేఖలో ప్రశ్నించినట్లుగా సమాచారం. వార్డు సిబ్బంది తరహాలోనే వీరి పైన రెవిన్యూ అధికారులు ఏ రకంగా విధులను కేటాయిస్తారు..వారి పైన పెత్తనం చేసారని ఆయన ఆ లేఖలో పేర్కొనట్లుగా చెబుతున్నారు.

డీజీపీ లేఖతో వారి సేవలు ఏ పరిధిలో
సీఎస్ ఆదిత్యనాద్ దాస్ తో పాటుగా వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయ్ జైన్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.పోలీసు శాఖలోకి తీసుకున్న సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ పనులు, చిన్న పిల్లల సంరక్షణ.. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ సర్వేకి సంబంధించిన పనులు, ఎంపీడీవో మరో పని, ఆఖరికి కలెక్టర్లు సైతం పింఛన్ల కోత, సంక్షేమ పథకాల కుదింపు జాబితా పనులు చెబుతున్నారంటూ ఆ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా పోలీసుల అసలు విధులు ఇవేనంటూ..
సంబంధిత వార్డుల పరిధిలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే మీ ప్రాంతంలో ఆకతాయిలు, భార్యను వేధించే భర్తలు, ఏకపక్ష ప్రేమికులు లాంటి సమాచారం ఇవ్వకుండా రోజూ ఏం చేస్తున్నారంటూ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ఒత్తిడి వస్తోంది. దిశ యాప్ డౌన్‌లోడ్స్, బలహీనుల మ్యాపింగ్, మహిళా సమస్యలపై అవగాహన కల్పించడం, నేరాలను అరికట్టే ప్రయత్నం, పలు కోణాల్లో పోలీసు విధుల తరహాలో వార్డు మహిళా పోలీస్ డ్యూటీ ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Recommended Video

ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం..
ఇకపై వీరికి ఇతర శాఖలు పని చెప్పకుండా ఆదేశాలు జారీ చేయాలని సీఎ్‌సను కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సిబ్బంది అవసరమైతే తనను గానీ, జిల్లా ఎస్పీలను గానీ సంప్రదించవచ్చంటూ డీజీపీ తన లేఖలో సీఎస్ ను కోరినట్లుగా సమాచారం. ఇప్పుడు ఈ లేఖ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వార్డు మహిళా పోలీసు సిబ్బంది విధుల పైన స్పష్టత ఇవ్వాలని వార్డు సచివాలయాల అధికారులు సైతం జిల్లా యంత్రాంగాలను కోరుతున్నారు. దీంతో..ఇప్పుడు డీజీపీ లేఖతో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications