చంద్రబాబు లేఖపై విచారణ- భువనేశ్వరి యాత్రకు అనుమతి అడగలేదన్న డీజీపీ..
ఏపీలో చంద్రబాబు ఆరెస్టు తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా చంద్రబాబు పేరుతో ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. జైలులో ఉన్న చంద్రబాబు పేరుతో విడుదలైన ఈ బహిరంగలేఖలో ప్రజలకు ఆయన చాలా విషయాలు చెప్పారు. దీంతో ఈ లేఖ జైలు నుంచి చంద్రబాబు ఎలా రాస్తారు, విడుదల చేస్తారన్న చర్చ మొదలైంది. దీనిపై ఇవాళ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.
చంద్రబాబు పేరిట విడుదలైన లేఖపై విచారణ నిర్వహిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, జైల్లో చంద్రబాబు రాశారా లేక ఆయన పేరుతో బయట ఉన్న టీడీపీ నేతలు విడుదల చేశారా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. ఇప్పటికే చంద్రబాబు లేఖపై వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డీజీపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాజమండ్రి సెంట్రలో జైల్లో చంద్రబాబు భద్రతపై వస్తున్న విమర్శలపైనా డీజీపీ స్పందించారు. చంద్రబాబు భద్రతకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎలాంటి ఢోకా లేదన్నారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి త్వరలో చేపట్టబోయే నిజం గెలవాలి యాత్రపై నా డీజీపీ స్పందించారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు ఇప్పటివరకూ ఎలాంటి అనుమతి కోరలేదన్నారు. అలా గే టీడీపీ నిరసనల్ని పోలీసులు అడ్డుకుంటున్నారన్న విమర్శలపై స్పందిస్తూ..పోలీసులు ఎక్కడా వారిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications