అక్టోబర్ నుండి వారికి ఎలా కావాలంటే అలా పింఛన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల పింఛన్ పంపిణీలో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పథకం కింద వారికి మూడు విధానాల్లో పింఛన్ అందించాలని నిర్ణయించింది. అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.

దివ్యాంగులకు పించన్ పంపిణీలో కొత్త విధానం

రాష్ట్రంలో మూడు అంధుల గురుకుల పాఠశాలలు, మూడు బధిరుల గురుకుల పాఠశాలలు, బాపట్లలో ఒక గురుకుల కళాశాల ఉన్నాయి. వీటిలో మొత్తం 424 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పించన్ 116 మంది బ్యాంక్ ఖాతాకు బదిలీ కోరగా, 17 మంది గురుకులంలోనే అందించాలని, 178 మంది ఇంటి వద్ద పంపిణీ కోరారు. గతంలో కొందరు విద్యార్థులు పింఛన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

AP differently abled students pension Ap govt will provide pensions in three ways from October

అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు

పించన్ విషయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారు పరిష్కరించుకోవటం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈ కొత్త ఎంపికల వల్ల ఆ సమస్యలు తగ్గుతాయని అంచనా.సెర్ప్ అధికారులు అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థులు, అంధులు కోరుకున్న విధంగానే పింఛన్ అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఈ విధానాలలో పించన్ జమ

ఏపీలోని దివ్యాంగ విద్యార్థులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు. వారి పించన్ డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చెయ్యవచ్చు. ప్రస్తుతం ఉన్న విధంగా ఇంటి వద్దే పింఛన్ అందించే అవకాశం కూడా ఉంది. లేదా వారు చదువుతున్న గురుకులం లేదా పాఠశాలలోనే పింఛన్ ఇవ్వడం చేయనుంది. గురుకులం సమీపంలోని స్వర్ణ సచివాలయానికి పింఛన్లు మ్యాప్ చేసి పాఠశాలలోనే అందించే ఏర్పాటు చేస్తున్నారు.

నేడు అర్దరాత్రి నుండి ఆటోలు, క్యాబ్ లు, స్కూల్ వ్యాన్ ల బంద్!
నేడు అర్దరాత్రి నుండి ఆటోలు, క్యాబ్ లు, స్కూల్ వ్యాన్ ల బంద్!

వారికి పించన్ ఎలా కావాలో ఎంపిక చేసుకునే ఆప్షన్

అయితే దివ్యాంగులు వారికి ఎలా కావాలి అనేది వారే స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు సౌకర్యం పెరుగుతుందని, వారి చదువుపై దృష్టి సారించే అవకాశం మెరుగవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా దివ్యాంగుల పించన్ కష్టాలకు అక్టోబర్ నుండి అధికారులు చెక్ పెట్టనున్నారు. ఇది నిజంగా వారికి శుభవార్త అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+