డీలిమిటేషన్ బిల్లు కోసం పట్టువదలని కేంద్రం ?- ప్రోరోగ్ కాని లోక్ సభ- అక్కడే డౌట్స్..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. దీంతో ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీని తర్వాత పార్లమెంట్ ఉభయసభల్ని ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పది రోజులవుతున్నా ఇంకా పార్లమెంట్ ప్రోరోగ్ కాలేదు. దీంతో లోక్ సభను (Lok Sabha)ప్రోరోగ్ చేస్తూ కేంద్రం ఎందుకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ, దీని వెనుక ఉన్న కారణాన్ని బయటపెట్టారు.
సాధారణంగా లోక్‌సభ నిరవధిక వాయిదా (sine die), దాని సమావేశాల ముగింపు (prorogation) మధ్య రెండు నుండి నాలుగు రోజుల వ్యవధి ఉంటుందని,అయితే, ఒకే రోజున వాయిదా , ముగింపు రెండూ జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని గుర్తుచేశారు. ఈ లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడి పది రోజులు గడిచినా, సమావేశాల ముగింపుకు సంబంధించిన సమాచారం ఇంకా వెలువడలేదన్నారు. 2015లో వర్షాకాలసమావేశాల (Monsoon session) విషయంలో ఈ వ్యవధి 28 రోజులు, అలాగే 2021లో 20 రోజులు ఉన్న మాట వాస్తవమే. కానీ అప్పట్లో ఎటువంటి దుర్మార్గపు ఎత్తుగడలూ సాగలేదన్నారు.

The time gap between the adjournment of the Lok Sabha sine die and its prorogation is generally two to four days - although there are many instances when adjournment and prorogation have taken place on the very same day.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 23, 2026
Ten days have gone by since this Lok Sabha was adjourned… pic.twitter.com/62Sq20KdSc
ప్రస్తుతం నెలకొన్న ఈ అసాధారణ జాప్యానికి కారణం ఏమిటి? ప్రత్యేక సమావేశం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి అవసరమైన 'అపఖ్యాతి మూటగట్టుకున్న' ఆ మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ కోసం కేంద్ర హోం మంత్రి ఇంకా అన్వేషిస్తున్నారా? అని జైరాం రమేశ్ ప్రశ్నలు సంధించారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టి నెగ్గించుకోవడంలో మరోసారి విఫలమైన కేంద్రం.. ఇందుకోసం ప్రత్యేక సమావేశాల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా పార్లమెంట్ ను ప్రోరోగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం.














Click it and Unblock the Notifications