ఏపీలో మరో డీఎస్సీ-నవంబర్ లో టెట్..! లోకేష్ ప్రకటన..!

ఏపీలో మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి దాదాపు 16వేల మందిని టీచర్లుగా నియమిస్తున్న సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈసారి డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని అమరావతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యామంత్రి లోకేష్.. ఈసారి డీఎస్సీలో ఉద్యోగాలు రాని వారు అధైర్యపడొద్దని సూచించారు.

ఈ ఏడాది నవంబర్ లో టెట్ పరీక్ష నిర్వహించబోతున్నామని, వచ్చే ఏడాది మరో డీఎస్సీ ఉంటుందని విద్యామంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గతంలో అత్యధిక డీఎస్సీలు నిర్వహించిన రికార్డు టీడీపీ ప్రభుత్వాలకే ఉందన్నారు. డీఎస్సీల ద్వారా 2 లక్షల మంది టీచర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. ఇప్పుడు కూడా మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందచేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

ap education minister nara Lokesh announces another DSC next year TET in this november

రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. స్టార్టప్ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. అహర్నిశలు కష్టపడతాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ap education minister nara Lokesh announces another DSC next year TET in this november

మరోవైపు ఈ సభలో డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జీవిత స్థితిగతులపై వీడియోలు ప్రదర్శించారు. ఎంత కష్టపడి చదువుకుని... డీఎస్సీలో విజయం సాధించారని వీడియోల్లో విద్యాశాఖ వివరించింది. తమ వీడియోలు చూసుకుని పలువురు అభ్యర్థులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. యువతకు స్పూర్తినిచ్చేలా అభ్యర్థులపై ఈ వీడియోల్ని రూపొందించారు. కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా టీచర్లుగా రిక్రూటైన కొత్త టీచర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక పత్రాలు అందచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+