AP Election: ఓటేయాలని ఆహ్వాన పత్రిక పంపుతున్నకలెక్టర్ .. ! విన్నూత్న ప్రయోగం..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్ధులు తమకే ఓటు ఎందుకు వేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో ఓటు వేయడానికి తరలిరావాలని కోరుతూ ఓటర్లకు ఆహ్వానపత్రికలు పంపారు ఓ జిల్లా కలెక్టర్. ఈ నెల 13న జరిగే పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఆ కలెక్టర్ చేస్తున్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈసీ ఆదేశాల మేరకు ఓటింగ్ శాతం పెంచేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఓ విన్నూత కార్యక్రమం కూడా చేపట్టారు. మరో మూడు రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో పాలుపంచుకోవాలంటూ ఓటర్లను ఇప్పటికే వివిధ రూపాల్లో కోరిన కలెక్టర్.. ఇప్పుడు వారికి ఆహ్వానపత్రికలు పంపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఆహ్వాన పత్రికను సైతం డిజైన్ చేయించారు.

ఈ ఆహ్వాన పత్రికలో ఎన్నికల పండుగ అయిన మే 13న పోలింగ్ కు హాజరై తనకు నచ్చిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధులకు ఓటేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటర్లను కోరుతున్నారు. మే 13వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం గంటల వరకు జరిగే ఎన్నికల ఓటింగ్ లో పాల్గొని ఓటు వేయాలని జిల్లా ఓటర్లను ఆయన కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికల మహోత్సవానికి హాజరై మీకు నచ్చిన వారికి ఓటేయాలన్నారు. అలాగే అందరికీ అర్ధం అయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఆహ్వాన పత్రిక తయారు చేసి పంపుతున్నాు. దీంతో ఈ జిల్లాలోని వాట్సప్ గ్రూపులలో జిల్లా కలెక్టర్ ఆహ్వాన పత్రిక ట్రెండ్ అవుతోంది.












Click it and Unblock the Notifications