జగన్ సర్కార్ కు ఉద్యోగుల డెడ్ లైన్-నెలాఖరులోగా పీఆర్సీ తేల్చాల్సిందే-ఉద్యమాలకు తేవొద్దు
ఏపీలో పీఆర్సీ నివేదిక విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగ సంఘాలు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. పీఆర్సీ ఎప్పుడిస్తారో తెలియకపోయినా కనీసం నివేదిక అయినా వస్తుందని ఎదురుచూసిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఏ విషయం చెప్పకుండా నానుస్తుండటంతో ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి నెలాఖరు వరకూ గడువుఇచ్చారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఇవాళ ప్రకటించాయి.

ఉద్యోగుల గరంగరం
ఏపీలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన ఉద్యోగ సంఘాల జేఏసీలు ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఇందులో ప్రభుత్వ వైఖరిని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై ఉద్యోగ నేతలు నిప్పులు చెరిగారు. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

ఉద్యోగుల తాజా డెడ్ లైన్
పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై తాము ఒత్తిడి చేయడం లేదని, ప్రభుత్వమే తమకు ఆశలు కల్పించిందని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పిఆర్సీ రిపోర్ట్ కోరామని,కానీ ఇప్పటికీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. అలాగే ఆర్థికపరమైన అంశాల పరిష్కారం కూడా జరగలేదన్నారు. పెండింగ్ బిల్లులు మార్చ్ లో క్లియర్ అవుతాయని ప్రభుత్వం చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై నిన్న సాయంత్రం రెండు జేఏసీలు చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. పీఆర్సీ నివేదికపై తేల్చేందుకు ప్రభుత్వానికి ఈ నెలాఖరువరకూ గడువు ఇస్తున్నట్లు బండి శ్రీనివాసరావు వెల్లడించారు.

జిల్లాల్లో సమావేశాలకు పిలుపు
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో కలిపి సుమారు 200 సంఘాలు ఉన్నాయని, జిల్లా అధ్యక్ష కార్యదర్శి కూడా జిల్లాస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 28లోగా సమావేశాలు పెట్టుకుని కార్యాచరణకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకపోతే నేరుగా రంగంలోకి దిగే అంశంపై ప్రకటన చేస్తామన్నారు. అదే సమయంలో సీఎస్ కు కూడా ఒక మెమోరాండం ఇస్తామన్నారు. అందులోనే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
Recommended Video

ఉద్యమాల వరకూ తీసుకురావొద్దని హెచ్చరిక
ఈ ప్రభుత్వంలో మూడేళ్ల నుంచి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయా అని .అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ .ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. హామీలన్నీ ఇప్పటికి హామీ లుగానే మిగిలి ఉన్నాయన్నారు. సీపీఎస్ రద్దు హామీ అమలు కాలేదుని, కమిటీ లతో కాలయాపన జరిగిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ అమలు కాలేదని బొప్పరాజు తెలిరారు. ఇవాళ పిఆర్సీ పరిస్థితి ఏంటి...పీఆర్సీ నివేదిక ఏడాది లోపు ఇవ్వాలని ఆయన కోరారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లోకి తీసుకెళ్లే క్రమంలో కూడా పిఆర్సీ ఆలస్యం అయిందని,ఆరు నెలలు పీఆర్సీ నివేదిక పెండింగ్ లో పెట్టి అధికారుల కమిటీ వేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు అధికారుల కమిటీ ఏమయ్యింది. ఏమి స్టడీ చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గత నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారని ఆయన గుర్తుచేశారు. కానీ ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలగడం లేదున్నారు.పిఆర్సీ సమస్యల తో పాటు సీపీఎస్ రద్దు కాంటాక్ట్ ఉద్యోగుల క్రమ బద్దీకరణ అంశం తక్షణమే అమలు చేయాలన్నారు.
కోవిడ్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు విషయంలో అధికారులు తప్పుగా మెమో ఇచ్చారని బొప్పరాజు తెలిపారు. సీఎం చెప్పినట్టుగా అధికారులు మెమో ఇవ్వలేదని,. దీనిపై తక్షణమే స్పందించాలన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం పిఆర్సీ అమలు చేయకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఉద్యమాల వరకు దయచేసి తీసుకు రావద్దని బొప్పరాజు ప్రభుత్వాన్ని కోరారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications