జగన్ సర్కార్ శరణు కోరిన ఉద్యోగ నేతలు-టీచర్ల నుంచి రక్షించాలంటూ- ఏం జరగబోతోంది ?
ఏపీలో ఉద్యోగ నేతలు, ఉపాధ్యాయుల మధ్య పోరు ముదురుతోంది. ముఖ్యంగా 23 శాతం పీఆర్సీకి అంగీకరించిన ఉద్యోగ నేతలపై సోషల్ మీడియా వేదికగా టీచర్లు పెడుతున్న పోస్టులు కలకలం రేపుతున్నాయి. ఇవి కాస్తా పతాకస్ధాయికి చేరడంతో తమను టీచర్ల బారి నుంచి రక్షించాలని వైసీపీ ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి నేతలు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందన్నది ఆసక్తి కరంగా మారింది.

ఉద్యోగ నేతలు వర్సెస్ టీచర్లు
ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన 23 శాతం పీఆర్సీకి అంగీకరించిన పీఆర్సీ సాధన సమితిలోని నలుగురు నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే బహిరంగంగానే వీరితో విభేదిస్తూ పీఆర్సీపై పోరు కొనసాగిస్తామని ఉపాధ్యాయసంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో ఉన్న టీచర్లలోనూ వీరిపై వ్యతిరేకంగా బాగా ముదిరింది. ఇది కాస్తా సోషల్ మీడియా వార్ కు సైతం దారి దీస్తోంది. ఈ వార్ ఇప్పుడు ఉద్యోగ నేతల్ని కలవరపెడుతోంది.

ఆ నలుగురే టార్గెట్
పీఆర్సీ సాధన సమితిని నడిపిస్తూ ప్రభుత్వంతో చర్చల్లో కీలకంగా వ్యవహరించి 23 శాతం పీఆర్సీకి ఒప్పుకున్న నలుగురు ఉద్యోగసంఘాల నేతలపై టీచర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం 27 శాతం పీఆర్సీ ఇవ్వకపోతే చర్చలకే వెళ్లమని ముందుగా చెప్పిన వీరంతా.. ఆ తర్వాత ప్రభుత్వానికి తలొగ్గి 23 శాతానికి అంగీకరించడం, మిగతా సమస్యల పరిష్కారం కూడా కాకపోవడంతో వీరిపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీరికి వ్యతిరేకంగా ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి కూడా టీచర్ల సంఘాలకు కలిసొస్తోంది. దీంతో ఆ నలుగురిని టార్గెట్ చేస్తూ టీచర్లు ముందుకు కదులుతున్నారు.

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు
23 శాతం పీఆర్సీకి ఒప్పుకున్న ఉద్యోగసంఘాల నేతల్ని కుక్కలతో పోలుస్తూ అనంతపురం జిల్లాలో టీచర్లు పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఈ నలుగురు నేతలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ప్రభుత్వానికి లొంగిపోయారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఉద్యోగ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో టీచర్ల సోషల్ పోరుపై ఏం చేయాలనే దానిపై రెండు రోజులుగా చర్చించుకున్న ఉద్యోగ నేతలు చివరికి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
Recommended Video

సర్కార్ జోక్యం కోరిన ఉద్యోగ నేతలు
పీఆర్సీపై ప్రభుత్వానికి లొంగిపోయారంటూ తమపై సోషల్ మీడియాలో జరుగుతున్న అనుచిత ప్రచారంపై పీఆర్సీ సాధన సమితిలోని నలుగురు నేతలు నిన్న సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కించపరిచే పోస్టులు పెడుతున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం టీచర్ల నుంచి ఉద్యోగ నేతలకు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని పోలీసు భద్రత కూడా కల్పించింది. ఇదే కోవలో తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని ఉద్యోగ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్ధితులు కనిపించడం లేదు. ఉపాధ్యాయుల ఆందోళన కూడా విరమించేలా చర్చలు జరపాలని భావిస్తున్న సర్కార్.. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటే ఆ పరిస్ధితి ఉండదనే భావనలో ఉంది. దీంతో ప్రభుత్వం టీచర్ల పోరుపై ఆచితూచి వ్యవహరిస్తోంది.
-
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications