విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఎంసెట్ ఫలితాల్లో టాపర్స్ వీరే: ఇంజినీరింగ్‌లో కృష్ణ, మెడిసిన్‌లో సుప్రియ ఫస్ట్, చెక్ చేసుకోండి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా కాకినాడ జేఎన్టీయూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు.

ఏపీ ఎంసెట్ ఆన్ లైన్ విధాంలో నిర్వహించారు. లక్షా 99వేల మంది పరీక్షలు రాస్తే, లక్షా 38వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 137 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు.

మెడిసిన్‌లో ఉత్తీర్ణత శాతం 87.60గా ఉంది. ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత 72.28 శాతంగా ఉంది. ఎంసెట్ కీలో 124 ప్రశ్నలపై అభ్యంతరాలు వచ్చాయి.

గత ఏడాదితో పోలిస్తే అర్హత సాధించిన వారి శాతం తగ్గింది. హైదరాబాదులో 6 కేంద్రాలతో పాటు మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

AP Engineering Agricultural and Medical Common Entrance Test (EAMCET)‬ results released

టాప్ 9 ర్యాంకులు అబ్బాయిలవే

ఎంసెట్ పరీక్షల్లో టాప్ 9 ర్యాంకులు అబ్బాయిలవే. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో బోగి సూరజ్ కృష్ణ (95.27 శాతం)కు మొదటి ర్యాంకు వచ్చింది. గట్టు మైత్రేయకు (95.13) రెండో ర్యాంక్, లోకేశ్వర్ రెడ్డికి (94.22) మూడో ర్యాంకు, వినాయక్ శ్రీవర్ధన్‌కు (94.20) నాలుగో ర్యాంకు, షేక్ వాజిద్‌కు (93.78) ఐదో ర్యాంకు, బసవరాజు జిష్ణుకు (93.51) ఆరో ర్యాంకు, వంశీనాథ్‌కు (92.86) ఏడో ర్యాంకు, హేమంత్ కుమార్‌కు (92.71) ఎనిమిదో ర్యాంకు, బొడ్డపాటి యజ్ణేశ్వర్‌కు (92.67) తొమ్మిదో ర్యాంకు, ముక్కు విష్ణు మనోజ్ఞకు (92.56) పదో ర్యాంకు వచ్చాయి.

అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో జంగాల సుప్రియ (94.78) మొదటి ర్యాంకు వచ్చింది. గంజికుంట శ్రీవాత్సవ్‌కు (93.26) రెండో ర్యాంకు, శ్రీహర్షకు (92.47) మూడో ర్యాంకు, గుండె ఆదర్శ్‌కు (92.12) నాలుగో ర్యాంకు, జానుభాయ్ రఫియా (91.95) అయిదో ర్యాంకు, ముక్తేవీ జయసూర్య (91.95) ఆరో ర్యాంకు, నల్లూరి వెంకట విజయకృష్ణ (91.31) ఏడో ర్యాంకు, నీలి వెంకటసాయి అమృత (91.21) ఎనిమిదో ర్యాంకు, తరుణ్ శర్మ (91.18) తొమ్మిదో ర్యాంకు, వంటేరు వెంకటసాయి హర్షవర్ధన్ రెడ్డి (91.16) పదో ర్యాంకు వచ్చాయి.

ఫలితాలు ఇలా చూసుకోండి: sche.ap.gov.in, www.sche.ap.gov.in/eamcet, www.vidyavision.com, www.manabadi.com, www.manabadi.co.in and www.schools9.com

English summary
AP Engineering Agricultural and Medical Common Entrance Test (EAMCET)‬ results released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X