సీఎం జగన్ తన కుమార్తెలను కరోనా ఉన్న రూమ్ లోకి పంపుతారా ? రెండో రోజు దీక్షలో ప్రశ్నించిన కేఏ పాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి మరియు ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ రెండవ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న విశాఖలో తన కన్వెన్షన్ భవనంలో దీక్షకు దిగిన కే ఏ పాల్, సీఎం జగన్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలోఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు కోసం కేఏ పాల్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.
కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నఈ సమయంలోఎన్నికలు నిర్వహించడం అవసరమా ? పునరాలోచించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు కోరింది. ఈ పిటిషన్ పై విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.
ఈ క్రమంలో తాజాగా కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మే 3వ తేదీన మళ్లీ విచారణ కొనసాగించనున్న తరుణంలో మే 3వ తేదీ వరకూ తన దీక్షను కొనసాగిస్తానని కె.ఎ.పాల్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ సర్కార్ పై మండిపడిన కే ఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నారంటూ పేర్కొన్నారు.ఆయనకు బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి తన కుమార్తెలను కరోనా ఉన్న రూమ్ లోకి పంపిస్తారా అంటూ ప్రశ్నించారు కేఏ పాల్. రాష్ట్రంలోని విద్యార్థులందరూ నీ బిడ్డల్లాంటి వారి కాదా అంటూ నిలదీశారు.వారిని కరోనా సమయంలో పరీక్షలు రాయమని చెప్పటం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు కేఏ పాల్. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఇప్పటికైనా పది ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.ఇక ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే ఏ పాల్.












Click it and Unblock the Notifications