సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖా మంత్రి కారునే గుద్దేసిన మందుబాబులు...మినిస్టర్ జవహర్ సురక్షితం...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

పశ్చిమ గోదావరి: మద్యం మత్తులో మంత్రిగారి కారునే గుద్దేసిన ఘనుల ఉదంతమిది. వారు గుద్దింది కూడా సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖా మంత్రి గారి కారే కావడం మరో విచిత్రం. అయితే ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బైటపడ్డారు.

ఎక్సైజ్‌ మంత్రి కెఎస్ జవహర్‌‌కి మందుబాబుల నుంచే ప్రమాదం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఓ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గురువారం రాత్రి దూబచర్లలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి జవహర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎక్సైజ్ మంత్రి కారును ఢీకొట్టిన వ్యక్తులు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు. మంత్రి కారు ప్రమాదం సమాచారం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైనవారిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

AP excise minister ks jawahar met an accident

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Excise Minister Jawahar escaped from the road accident. On Thursday night in West Godavari district his car was hit by another car. In this incident, the minister safely escaped.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి