Aaraa mastan : ఏపీలో నా సర్వే తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండడు

దేశం మొత్తం ఎంతో అత‌ృతుగా చూసిన ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి. ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ కూడా ప్రకటించాయి. అయితే ఏపీ రాష్ట్ర పరిస్థితికి వచ్చే సరికి సర్వేలు భిన్నమై ఫలితాలను ప్రకటించాయి. నేషనల్ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధింస్తుందని ప్రకటించగా, స్థానిక సర్వేలు వైసీపీకి పట్టం కట్టాయి. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆరా మస్తాన్ సర్వే కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు.

ఆరా మస్తాన్ తన సర్వేలో తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. 94 నుంచి 104 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారని ఆయన ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఓ వార్త ఛానెల్‌లో మాట్లాడిన ఆరా మస్తాన్.. తన సర్వే రిపోర్టు గురించి వివరించారు. రోజా, సిదిరి అప్పలరాజు, అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విడుదల రజినీ, అంబటి రాంబాబు గట్టి పోటిని ఎదుర్కొంటున్నారని ఆరా మస్తాన్ తెలిపారు.

AP Exit poll 2024 If my predictions goes wrong i will quit psephology field says Aaraa Mastan

హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలంతా కూడా కూటమికి ఓటు వేశారని చెప్పడం తప్పే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.కూటమిలో బీజేపీ కలవడం వల్ల టీడీపీకి మైనస్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. అయితే అఖరిలో ఏపీలో మీ సర్వే ఫెయిల్ అయితే మీరు ఏం చేస్తారని న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు..ఏపీలో నా సర్వే 100కి 100 శాతం నిజం అవుతుందని.. నా సర్వే లెక్క తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండరని ఆయన తన సర్వేపై ధీమా వ్యక్తం చేశారు. నా సర్వేకు వైసీపీ 10 సీట్లు అదనంగా పెరుగుతాయే కానీ తగ్గడం మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+