ఏపి ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి: కెసిఆర్
హైదరాబాద్: ఏపి ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపి ఎక్స్‌ప్రెస్ పేరు అసమంజసంగా ఉందన్నారు. అదే విధంగా హైదరాబాద్-సిర్పూర్-కాగజ్‌నగర్‌ల మధ్యనడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరును కొమురంభీం ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని అభిప్రాయపడ్డారు.
పేర్ల మార్పును కోరుతూ ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖకు ఓ లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.

ప్రణాళిక సంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా నిరంజన్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.
దొడ్డ సుధాకర్‌కు దళిత సాహిత్య అకాడమీ అవార్డు
భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు దొడ్డ సుధాకర్ డాక్టర్ అంబేద్కర్ అవార్డును అందుకున్నారు. దళిత సాహిత్య అకాడమీ సంస్థను డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ 1984లో స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రతీ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యమకారులకు, కవులకు, రచయితలకు ఈ అవార్డును అందజేస్తారు.
జిల్లాలో ఫూలే, అంబేద్కర్ జయంతి, వర్ధంతిలను నిర్వహించడంతో పాటు సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చైతన్య పర్చినందుకు దొడ్డ సుధాకర్‌కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును అకాడమీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫేసర్ సుమనాక్షర్ చేతుల మీదుగా అందుకున్నారు.












Click it and Unblock the Notifications