AP Budget 2023-24:బడ్జెట్ అడ్డుకున్న టీడీపీఏపీ బడ్డెట్ ప్రసంగంలో బుగ్గన సూక్తులు-మహానుభావుల కోట్స్ ప్రస్తావన..

ఏపీ అసెంబ్లీలో ఇవాళ బడ్డెట్ ప్రసంగం చేసిన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పలువురు ప్రముఖుల కోట్స్ ను ప్రస్తావించారు.

అమరావతి : ఏపీలో 2023-24 ఆర్ధిక సంవత్సరం కోసం వార్షిక బడ్డెట్ ప్రతిపాదనలు చేసిన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. తన ప్రసంగంలో ఆద్యంతం ప్రముఖుల సూక్తుల్ని ప్రస్తావించారు. వాటి ఆధారంగానే తమ ప్రభుత్వం సంక్షేమంతో పాటు ఇతర కార్యక్రమాల్ని చేపడుతోందన్నారు.

కోవిడ్ సమయంలో అర్ధరాత్రులు నిద్రలేకుండా పని చేస్తూ ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరి సేవలను మరువలేనంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అనంతరం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక శతాబ్దం క్రితం శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన "నిరంతరం కార్యదీక్ష, విశాలదృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా ..ఆ స్వేచ్ఛగా విహరించేలా నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రీ" అంటూ ఇచ్చిన సందేశాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు.

ap finance minister buggana rajendranath quotes while presenting budget in assembly

బడ్డెట్ ప్రసంగం మరో సందర్భంలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ వ్యాఖ్యల్ని బుగ్గన గుర్తుచేశారు. "ప్రతి వస్తువును రిటైల్ గా కొనుగోలు చేసి..తాను పండించిన ఉత్పత్తిని మాత్రం హోల్ సేల్ గా అమ్ముకునే అభాగ్యులు రైతులు" అంటూ రైతుల కష్టంపై 35వ యూ.ఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ మాటలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉటంకించారు.

ap finance minister buggana rajendranath quotes while presenting budget in assembly

"భూమిని సాగుచేసే వారు అత్యంత ముఖ్యమైన పౌరులు, వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు, అత్యంత ధర్మబద్ధులు" అన్న థామస్ జెఫర్సన్ వ్యాఖ్యల్ని వ్యవసాయ రంగం కేటాయింపుల ప్రస్తావన సందర్భంగా బుగ్గన గుర్తుచేశారు.

"అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది, సృజనాత్మకత ఆలోచనకు దారి తీస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది, జ్ఞానం నిన్న గొప్పవాడిగా చేస్తుంది" అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంవ్యాఖ్యల్ని విద్యారంగానికి కేటాయింపుల సందర్భంగా బుగ్గన ప్రస్తావించారు.

ap finance minister buggana rajendranath quotes while presenting budget in assembly

"విద్యమాత్రమే మానవాళికి జీవనాడి, విద్య వలన ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది, ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారి తీస్తుంది" అన్న స్వామి వివేకానంద వ్యాఖ్యల్ని కూడా బుగ్గన తన ప్రసంగంలో ఉటంకించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+