వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యనమల టెక్కీ బడ్జెట్: రాజధానికి 20వేల కోట్లు, కేంద్రం కంటే ఏపీ ముందు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారి మంత్రి యనమల ఈ-బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ట్యాబ్‌లను సభ్యులకు అందించారు.

దివంగత అబ్దుల్ కలాం, స్వామి వివేకానందలను తలుచుకుంటూ ఆయన బడ్జెట్ ప్రసంగం చదవడం ప్రారంభించారు. రాష్ట్రంలో సర్టిఫికేట్లు లేని పాలన ఉంటుందని యనమల చెప్పారు. కాగితాలతో నిమిత్తం లేకుండా సచివాలయంలో ఈ ఆఫీస్ ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానం వర్తింప చేస్తామన్నారు.

మీ సేవతో పాటు బీ2సీ, జే2సీ సేవలను సముచిత ధరలో అందించేలా మొబైల్ మీ సేవ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రగతి పేరిట ఏపీ స్టేట్ ఎంటర్ ప్రైజెస్ ఆర్కిటెక్చర్ అమలు చేస్తామన్నారు. యనమల బడ్జెట్ ప్రసంగం రెండు గంటలు సాగింది. యనమల బడ్జెట్ అనంతరం మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత సభ వాయిదా పడింది.

206-17 బడ్జెట్ - 1,35,688.99 కోట్లు
ప్రణాళికా వ్యయం - 49,134.44 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - 86,554.55 కోట్లు
రెవెన్యూ లోటు అంచనా - 4,868 కోట్లు
ఆర్థిక లోటు అంచనా - 20,497 కోట్లు

ముఖ్యాంశాలు..

అమరావతికి రూ.1500 కోట్లు
కాపులకు రూ.1000 కోట్లు
2015-16లో ఆదాయ లోటు రూ.4,140 కోట్లు
తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.13,897 కోట్లు
2014-15 సంవత్సరానికి కేంద్రం నుంచి రెవెన్యూ లోటు కింద రూ.3వేల కోట్లు వచ్చాయి.
రాష్ట్రం సొంత ఆదాయం 16 శాతం పెరిగింది.

AP Finance Minister Yanamala produces E Budget in Assembly

- యువతకు ఉధ్యోగాలు కల్పించే విధంగా నైపుణ్యాల పెంపు
- 18 నుంచి 35 ఏళ్ల యువతకు 5 శాతం నిధులు కేటాయింపు
- 2019లో అమరావతిలో జాతీయ క్రీడలు నిర్వహించుకునే అవకాశం దక్కించుకున్నాం
- కర్నూలు స్మార్ట్ సిటీగా చేస్తాం
- అమరావతిలో ఈ ఏడాది శాశ్వత నిర్మాణాలు, మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభం
- పట్టణాల్లో 320 కోట్ల అంచనా వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం
- తిరుపతి, విజయవాడ, విశాఖలలో మూడు సమగ్ర క్రీడా సముదాయాల నిర్మాణం
- 2029 నాటికి రెండు లక్షల మందిని అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేయాలని లక్ష్యం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మనార్టీ, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాల ఆర్థిక వృద్ధికి తోడ్పాటు
- కాగితంతో నిమిత్తం లేని సచివాలయం. ఈ-ఆఫీస్.
- నగర పంచాయతీ, గ్రామాల్లో రూ.100 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం
- అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణం.
- 2016-17 ఆర్థిక సంవత్సరంలో 127 స్టేడియాలు నిర్మించాలనేది లక్ష్యం
- వివిధ శాఖల్లో 12వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు, వివిధ శాఖల్లో మరో 20వేల పోస్టులను సమీప భవిష్యత్‌లో భర్తీ

- పర్యాటక రంగానికి రూ.228 కోట్లు
- పట్టు పరిశ్రమకు రూ.147 కోట్లు
- తిరుపతిలో సైబర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ కన్వెన్షన్ సెంటర్
- బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా 50వే కుటుంబాలకు చేయూత
- 2020 నాటికి రాష్ట్రాన్ని దేశానికి నైపుణ్యం గల కేంద్రంగా చేస్తాం
- గిరి గోరుముద్దలు పథకంలో ఆరు నెలల చిన్నారుల నుంచి ఆరేళ్ల పిల్లలకు పౌష్టికాహారం

- సింగిల్ విండోతో పరిశ్రమకు అనుమతులు
- బోగాపురం, దుగదుర్తి తదితర ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షా ఇరవై వేల గృహాలు. ఇప్పటికే 74వేలకు పైగా ఇళ్లకు కేంద్రం అనుమతి
- 15వేల కోట్ల నుంచి 18వేల కోట్ల వరకు అమరావతి నిర్మాణానికి అవసరం
- నదుల అనుసంధానానికి పెద్దపీట
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యం
- రుణమాఫీతో 674 స్వయం సహాయక గ్రూపులకు లబ్ధి
- రానున్న మూడేళ్లలో 4800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
- రాయలసీమను జాతీయ రహదారులతో రాజధానికి అనుసంధానం
- రూ.10 కోట్లతో రహదారి భద్రతా నిధి
- బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి భారీగా కేటాయింపులు, సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు.
- ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తాం
- వ్యవసాయం వృద్ధి 8.4 శాతం.
- సేవారంగంలో మెరుగైన 11.39 శాతం వృద్ధి.
- పారిశ్రామిక రంగంలో 11.43 శాతం వృద్ధి.
- ఇంధన భద్రతకు రూ. 4,020 కోట్లు.
- ఎన్టీఆర్ జలశ్రీ ఫేజ్-1తో ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు
- 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం
- పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు. ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు. 21 రోజుల అనుమతుల కాలాన్ని 14 రోజులకు కుదింపు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట.

- వంశధార, గుండ్లకమ్మ, వెలుగొండ ప్రాజెక్టులను 2018నాటికి పూర్తి చేస్తాం
- నీటి పారుదల రంగం శీఘ్ర పథకానికి రూ.3,135 కోట్లు
- వచ్చే ఏడాది పెట్టుబడుల లక్ష్యం రూ.11,500 కోట్లు
- చేనేత రుణమాఫీ వల్ల 24వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
- విశాఖ - చెన్నై కారిడార్‌కు ఐడీబీ సాయం
- చెన్నై - బెంగళూరు, విశాఖ - చెన్నై కారిడార్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తాం
- వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం
- ప్రకాశం జిల్లాలో 43,700 కోట్లతో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి మండలి, దీంతో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు
- జూన్ నెల నాటికి 4.6 లక్షల ఇళ్లకు విద్యుధీకరణ చేస్తాం.
- చిత్తూరు జిల్లాలో 5వేల హెక్టార్లలో జాతీయ పెట్టుబడిదారుల సంస్థ
- ఇప్పటి వరకు 1.87 లక్షల ఎల్‌ఈడీ బల్పులు సరఫరా చేశాం
- దొనకొండలో 5079 ఎకరాల్లో పారిశ్రామిక మండలి
- కాకినాడలో కల్చరల్ సెంటర్, తిరుపతి, విజయవాడ, విశాఖలలో కన్వెన్షన్ సెంటర్లు
- మున్సిపల్ శాఖకు రూ.4,328 కోట్లు
- సాగునీటి రంగానికి రూ.3512 కోట్లు
- పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
- వ్యవసాయ రంగంలో8.4 శాతం వృద్ధి
- తాగునీటికి రూ.3,300 కోట్లు
- చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు జైకా ఆర్థిక సాయం
- రూ.9505 కోట్ల పెట్టుబడులు 2014-15లో వచ్చాయి.
- తోటపల్లి, పోలవరం కుడికాలువు, హంద్రీనీవా, గాలేరు నగరి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం.
- గత ఏడాది 76818 మందికి ఉపాధి కల్పించాం.-
- బెజవాడ డ్రెయినేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు
- 2016-17 వాస్తవ లోటు రూ.20,497 కోట్లు, రెవెన్యూ లోటు రూ.4868 కోట్లు
- 2015-16 బడ్జెట్ లోటు రూ.17వేల కోట్లు
- రాష్ట్ర అభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు
- 2015-16లో చేనేత రంగంలో 11 కోట్లు రుణమాఫీ చేశాం
- చిన్న నీటి పారుదలకు ప్రణాళికా కేటాయింపులు రూ.674 కోట్లు
- పోలవరం ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రం సమకూరుస్తుంది.
- కరవు నివారణకు రూ.50 కోట్లు
- ఫైబర్ గ్రిడ్‌కు రూ.320 కోట్లు

- 2015-16లో ఆదాయ లోటు రూ.4,140 కోట్లు
- తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.13,897 కోట్లు
- 2014-15 సంవత్సరానికి కేంద్రం నుంచి రెవెన్యూ లోటు కింద రూ.3వేల కోట్లు వచ్చాయి.
- రాష్ట్రం సొంత ఆదాయం 16 శాతం పెరిగింది.
- మత్స్య పరిశ్రమకు రూ.339 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు రూ.819 కోట్లు
- పట్టు పరిశ్మకు రూ.147
- ఉద్యాన శాఖకు రూ.659 కోట్లు
- రుణ విముక్తి పథకానికి 3,512 కోట్లు
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.16,491 కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు
- జలనవరుల శాఖకు రూ.7,325 కోట్లు
- ఆహార పరిశ్రమకు రూ.100 కోట్లు
- గనులు, భూగర్భ శాఖ ద్వారా రాబటి 1,632 కోట్లు ఆశిస్తున్నాం
- చేనేత రంగానికి రూ.127 కోట్లు
- ఐటి శాఖకు రూ.360 కోట్లు
- కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు
- పర్యాటక శాఖకు రూ.227 కోట్లు
- రహదారుల భద్రతకు రూ.150 కోట్లు
- రహదారుల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
- గృహ నిర్మాణానికి రూ.1,132 కోట్లు
- ఇంధన భద్రతకు రూ.4,020 కోట్లు
- ప్రాథమిక విద్యకు రూ.17,502 కోట్లు
- వైద్యం, ఆరోగ్యానికి రూ.2,933 కోట్లు
- మధ్యాహ్న భోజనానికి రూ.250కోట్లు
- ఉన్నత విద్యకు రూ.2642 కోట్లు
- ఐసీడీఎస్ పథకానికి రూ.772 కోట్లు
- ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.2702 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.8,832 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.710 కోట్లు

- ఎస్సీ సంక్షేమానికి రూ.8724 కోట్లు

- ఎస్టీ సంక్షేమానికి రూ.3100 కోట్లు
- బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.65 కోట్లు
- కాపు కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
- సాంఘిక భద్రత పింఛన్ల కోసం రూ.2998 కోట్లు
- యువత సాధికారత కోసం రూ.252 కోట్లు
- మహిళా సాధికారత కోసం ప్రత్యేక ప్రాజెక్టు
- మహిళా సాధికారకతకు రూ.642 కోట్లు
- క్రీడాశాఖకు రూ.215 కోట్లు
- నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా లక్షమందికి శిక్షణ
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.377 కోట్లు
- ఉపాది హామీ పథకానికి రూ.4,764 కోట్లు
- పట్టణ పరిపాలనకు రూ.4,728 కోట్లు
- గ్రామీణ నీటిసరఫరాకు రూ.1,195 కోట్లు
- భూపరిపాలనకు రూ.3,119 కోట్లు
- ఆకర్షణీయ వార్డులు, గ్రామాలకు రూ.3100 కోట్లు
- శాంతిభద్రతలకు రూ. 4,785 కోట్లు.
- పారిశుద్ధ్యం కోసం రూ.320 కోట్లు
- అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు
- 206-17 బడ్జెట్... 1,35,688.99 కోట్లు
- గత ఏడాదితో పోలిస్తే 20.13 శాతం బడ్జెట్‌లో వృద్ధి
- యనమల.. అబ్దుల్ కలాం సుభాషితంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
- ఈ బడ్జెట్‌ను ట్యాబ్‌ల ద్వారా సభ్యులకు అందించారు.

English summary
AP Finance Minister Yanamala produces E Budget in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X