జగన్ సర్కార్‌పై కంప్లయింట్: ఆ రెండు అంశాలే ప్రధానంగా: గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటి కిందట విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు. ఊహించినట్టే.. ఆయన జగన్ సర్కార్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఆ అంశంపైనే ఆయన గవర్నర్‌కు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఓ వినతిపత్రం ఆయనకు అందజేశారు. రాజకీయ కారణాలను అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా తనను ఇబ్బందులకు గురి చేస్తోందనే విషయాన్ని ఆయన గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను పునర్నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారు.
Recommended Video

హైకోర్టు ఆదేశాల మేరకు
హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటి కిందట రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు వారిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. తాను ఎందుకు కలవాల్సి వచ్చిందనే విషయాన్ని నిమ్మగడ్డ..గవర్నర్‌కు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను రాజ్‌భవన్‌కు రావాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం తాను చెప్పదలచుకున్న విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు తీర్పు గురించి ప్రస్తావించినట్లు సమాచారం.

దురుద్దేశంతో..
హైకోర్టు ఆదేశాల తరువాత కూడా తనను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలను అప్పగించడానికి వెనుకాడుతోందని రమేష్ కుమార్ గవర్నర్‌కు వివరించినట్లు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు గురించి వివరించారు. హైకోర్టు సీసీ నంబర్ 565 ఆఫ్ 2020 గురించి నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రోజులు గడుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించట్లేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఇది హైకోర్టు ధిక్కరణ కిందికి పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు అయ్యేలా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారు.

పునర్నియమించేలా..
తనను మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన విషయంలో ప్రభుత్వం ప్రారంభం నుంచీ దురుద్దేశంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. తనను తొలగించడం దగ్గరి నుంచీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని కూడా ఆయన గవర్నర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలన్నింటినీ తాను ఆయనకు అందజేసిన వినతిపత్రంలో క్షుణ్నంగా వివరించినట్లు సమాచారం.

ప్రధానంగా రెండు అంశాలపైనే
ప్రధానంగా రెండు అంశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ వద్ద ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడటం, రాజకీయ కారణాలతో తనను పునర్నియమించకపోవడం వంటి విషయాలపై వివరించినట్లు సమాచారం. రమేష్ కుమార్ ప్రస్తావించిన అంశాలను గవర్నర్ విన్నారని, సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. రమేష్ కుమార్ ఇచ్చిన వినతిపత్రంలో పొందుపరిచిన కొన్ని విషయాలపై తనకు ఉన్న అనుమానాలను గవర్నర్ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications