కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది : 4 రోజులు మించి బొగ్గు నిల్వలు లేవు- సీఎండీ శ్రీకాంత్

దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా బొగ్గు కొరత ఉందని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ శ్రీకాంత్ చెప్పారు. 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో చాలా వాటిలో 4 రోజులు మించి బొగ్గు నిల్వలు లేవన్నారు. ఏపీ జెన్కో కు రావాల్సిన రేక్స్ క్రమంగా పెరుగుతున్నాయని వివరించారు. ఆర్టీపిపి, వీటీపీఎస్ లో రెండురోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసారు. అంతర్జాతీయ గా బొగ్గు రేట్లు రెండు మూడు రెట్లు పెరిగాయన్నారు. దేశీయ బొగ్గు గనుల పైనే అంతా ఆధారపడటంతో ఒత్తిడి నెలకొందని చెప్పారు. కేంద్రానికి కూడా దీనిపై లేఖ రాస్తున్నామన్నారు.

ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉందని..కోవిడ్ కారణంగా 20 శాతం మేర విద్యుత్ వినియోగం పెరిగిందని వివరించారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. ఏపీ జెన్కో నుంచి 40 మిలియన్ యూనిట్లు, కేంద్ర ప్లాంట్ల నుంచి 30 మిలియన్, జల విద్యుత్ కేంద్రాల నుంచి 20 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతోందని లెక్కలు విశ్లేషించారు. సౌర, పవన విద్యుత్ సరఫరా కారణంగా రెండేళ్లుగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల తో ఒప్పందం చేసుకోలేదన్నారు.

AP GENCO CMD Srikanth explained the coal shortage effect on energy production in the state

ప్రస్తుతం అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల లోను వంద శాతం ఉత్పత్తి జరగడం లేదని వివరించారు. బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత నెలలో16 తేదీన లో యూనిట్ కు 4.60 పైసలు ఉంటే ఇప్పుడు ఆగస్టు 7 తేదీన 14 రూపాయలకు చేరిందన్నారు. పీక్ డిమాండ్ ఉన్న సమయంలో అధిక రేటు పెట్టి కొనాల్సి ఉంటుందన్నారు. ఒక్కోసారి విద్యుత్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. బొగ్గు ఉంటే జెన్కో ప్లాంట్ ల నుంచి మరో 40 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసుకోవచ్చని వివరించారు.

గృహ వినియోగదారులు పీక్ డిమాండ్ సమయంలో ఏసీ లోడ్ తగ్గిస్తే 10 మిలియన్ యూనిట్ లు కొనుగోలు చేసే అవసరం ఉండదని శ్రీకాంత్ చెప్పారు. త్వరలోనే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేసారు. గ్యాస్ ఆధారిత ప్లాంట్ లలోను విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని వెల్లడించారు. వేరే రాష్ట్రంపైనే బొగ్గు గనుల పైనే ఏపీ ఆధారపడి ఉందన్నారు. సౌర, పవన విద్యుత్ నే ఎక్కువ వినియోగించాలని కేంద్రం సూచించిందని చెప్పారు. 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏపీలోని థర్మల్ పవర్ ప్లాంట్ అవసరం ఉందని..ప్రస్తుత సంక్షోభానికి ఒకరు కారణం అని వేలెత్తి చూపలేమని శ్రీకాంత్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+