చంద్రబాబు సర్కార్ లోకి ఎన్నికల ప్రధానాధికారి-కీలక బాధ్యతల అప్పగింత!

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల్లో ఉన్న ఆయన అందులో నుంచి వైదొలగి తిరిగి ప్రభుత్వంలోకి వచ్చారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు రెండు కీలక శాఖలకు బాస్ గా నియమించింది. దీంతో ఆయన ఇవాళ వాటి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి ముకేష్ కుమార్ మీనా వైదొలగడంతో ఆయన స్ధానంలో మరో ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమితులయ్యారు. మరోవైపు ముకేష్ కుమార్ మీనాకు ప్రభుత్వం ఎక్సైజ్, వాణిజ్య పరిశ్రమల శాఖల బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ అదనపపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఈ రెండు కీలక శాఖలకూ ముకేష్ కుమార్ మీనా బాస్ గా వ్యవహరించనున్నారు.

ap government allots two key responsibilities to former chief election officer Mukesh kumar meena

1998 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అయిన ముకేష్ కుమార్ మీనా తాజా ఎన్నికల సందర్భంగా పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున నకిలీ ఓట్ల తొలగింపు, ఎన్నికల అక్రమాలు, అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు ఇలా పలు అంశాల్లో ఎదురైన సవాళ్లను మీనా దీటుగా ఎదుర్కొన్నారు. సీఈసీకీ నమ్మకమైన అధికారిగా వ్యవహరించారు. దీంతో మీనా పనితీరు ఈసీ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు ఆయన సిద్దమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+