Akhanda 2: బాలయ్యకు చంద్రబాబు బిగ్ న్యూస్..! అఖండ 2కు బూస్ట్..!

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాతలు చేసిన ఓ విజ్ఞప్తికి ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

భారీ బడ్జెట్ తో తీసిన అఖండ 2 చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఈ చిత్ర నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వారి విజ్ఞప్తిని మన్నిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4న రాత్రి 10 గంటలకు ప్రత్యేక బెనిఫిట్ షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే సినిమా విడుదలైన రోజు నుండి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

AP Government Boosts Akhanda 2 Revenue with Ticket Price Hike Order

బాలయ్య నటించిన అఖండ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ చిత్రం అఖండ 2పైనా భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ 2లోనే బాలయ్య విశ్వరూపం చూపించాడని అభిమానులు అప్పట్లో సంబరపడ్డారు. దీంతో దర్శకుడు బోయపాటి ఈసారి అఖండ 2లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని అభిమానులకు పండగ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. అలాగే బాలయ్య వేషధారణ చూస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందేనంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+