తోపులాటకు బ్రేక్: రద్దీ నివారణకు వ్యాక్సిన్ స్లిప్పులు: ఇంటికే: ఫస్ట్ డోస్ బ్యాన్
అమరావతి: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం నిలిపివేసింది. ఇది తాత్కాలికమే. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో ఎక్కడా టీకాలను వేయకూడదని నిర్ణయించుకుంది. హఠాత్తుగా దీన్ని నిలిపివేయడానికి కారణం- దాన్ని క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడి ఉండటం, తోపులాట చోటు చేసుకుంటోండటం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
Recommended Video
ఆయా కేంద్రాల వద్ద రద్దీని నివారించడానికి కొత్తగా వ్యాక్సిన్ స్లిప్పుల విధానాన్ని అమలు చేయనుంది. బుధవారం నుంచి ఇది కార్యరూపం దాల్చుతుంది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ప్రభుత్వం అర్హుల ఇళ్ల వద్దకు పంపిస్తుంది. టీకా వేయించుకోవడానికి కోవిన్ ద్వారా లేదా గ్రామ/వార్డు సచివాలయాల్లో తమ పేర్లను నమోదు చేయించుకున్న వారి పేర్ల మీద ఈ స్లిప్పులు రూపొందుతాయి. గ్రామ/వార్డు వలంటీర్లు, ఎఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా వాటిని అందజేస్తుంది ప్రభుత్వం.

ఏ వ్యాక్సిన్ సెంటర్‌కు..ఎన్ని గంటలకు వెళ్లాలనేది ఇందులో పొందుపరిచి ఉంటుంది. దానికి అనుగుణంగా అర్హలు.. ఆయా సమయానికి వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్తే సరిపోతుంది. దీనికి అదనంగా- ఆ స్లిప్పుల్లో ఉండే సమాచారాన్ని అర్హుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా అందజేస్తుంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడినందున.. దీన్ని అధిగమించడానికి- తొలి విడత వ్యాక్సిన్ తీసుకోదలిచిన వారికి కూడా తాత్కాలికంగా ఇంజెక్షన్ ఇవ్వడాన్ని నిలిపివేసింది.
మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకుని.. రెండో డోసు కోసం ఎదురు చూస్తోన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పటికే రెండో డోసు టీకా కోసం వేలాదిమంది ఎదురుచూస్తోన్నారు. వారందరికీ- రెండో డోసు వ్యాక్సిన్ పూర్తయ్యాకే మొదటి డోస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి డోస్ వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని తెలిపింది. రెండో డోసు పూర్తి కాకముందే- తొలి ఇంజెక్షన్ వేసినట్లు సమాచారం అందితే.. వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.












Click it and Unblock the Notifications