Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి నిధుల్లో వెయ్యి కోట్ల మళ్లింపు ? ప్రభుత్వం క్లారిటీ ఇదే..!

ఏపీలో అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం తర్వాత చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు హడ్కో అమరావతి రాజధానికి ఇచ్చిన రుణాల్ని విడుదల చేయించడంతో పాటు ఆ నిధుల్ని ఎక్కడెక్కడ ఖర్చుపెట్టాలో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో కొన్ని నిధుల్ని ఇప్పటికే పలు ప్రాజెక్టులకు కేటాయిస్తోంది. అయితే ఈ కేటాయింపుల్లో దాదాపు వెయ్యి కోట్ల మేర ఇతర అవసరాలకు మళ్లించారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో రుణాల ద్వారా వచ్చిన నిధులు ఏమవుతున్నాయో గణాంకాలతో సహా క్లారిటీ ఇచ్చింది. ఇందులో ప్రభుత్వం .. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో సంస్థల నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని కొందరు చేస్తున్న ప్రచారం అబద్దమని తేల్చేసింది.

Amaravati loan ap govt

అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నిధులను గ్రాంటుగా ప్రకటించి అందులో రూ.2,100 కోట్లను 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విడుదల చేసిందని, ఈ నిధులు పీడీ ఖాతాకు జమ చేయబడ్డాయని తెలిపింది.

అలాగే ఈ నిధుల నుండి రూ.501.94 కోట్లను రాజధాని అమరావతిలో విదేశీ బ్యాంకులు,అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంక్, ఏడీబీల సహకారంతో చేపట్టిన పలు పనులు/ప్రాజెక్టులకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించేందుకు ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించింది. మిగిలిన రూ.1,598.60 కోట్ల నిధులు ఏపీ సిఆర్డిఏ పీడీ ఖాతాలోనే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

అలాగే రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హడ్కో రూ.11 వేల కోట్ల నిధులను మంజూరు చేయగా.. 2025 జూన్ 30వ తేదీన రూ.2,236.30 కోట్లు హడ్కో నుంచి విడుదల అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నిధులలో రూ.862.86 కోట్లను అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్(ADCL)కు రాజధాని నగరంలో చేపట్టిన పనులు/ ప్రాజెక్టుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్ అడ్వాన్సుల చెల్లింపుల కోసం విడుదల చేయడం జరిగిందని తెలిపింది.

దీనికి అదనంగా ఈ చెల్లింపుల నిమిత్తం ఏపీ సిఆర్డిఏ మరో రూ.805.47 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా హడ్కో అందజేసిన నిధుల నుంచి రూ.1,688.33 కోట్లు రాజధానిలో చేపట్టిన ప్రాజెక్టుల నిమిత్తం వినియోగించడం జరిగిందని తెలిపింది. హడ్కో ఎస్క్రో ఖాతాలో మిగిలిన రూ.566.04 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

కాబట్టి రాజధాని అమరావతి నిర్మాణం కొరకు మంజూరు చేసిన నిధులు మళ్లించారంటూ విదేశీ బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు కానీ, హడ్కో సంస్థ కానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. కాబట్టి నిధుల మళ్లింపు అంటూ వస్తున్న ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మకండి. ఇది స్వయంగా ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఇస్తోన్న వివరణ అని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+