ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్-బంద్ పై కీలక నిర్ణయం..!
ఏపీలో ప్రభుత్వం త్వరలో తెస్తున్న ఎక్సైజ్ పాలసీతో తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు చేపట్టాలనుకున్న బంద్ వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో ఇలా షాపులు మూసేసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వ వినతి మేరకు వారు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
బేవరేజెస్ ఉద్యోగులు తమ బంద్ వాయిదా వేసుకోవడంతో ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపి బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్ బంద్ ని నిరవధిక వాయిదా వేసినట్లు తెలిపింది. బంద్ వాయిదాపై ఈ నెల 4వ తేదీనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి సంఘ ప్రతినిధులు లేఖ అందించినట్లు వెల్లడించింది. వారి సమస్యల పరిష్కారానికి కమిషనర్ నిశాంత్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలు బంద్ చేస్తారంటూ సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని యధావిదిగానే పని చేస్తాయని కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మందుబాబులు యథావిధిగా కొనుగోలు చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం త్వరలో ఓ పరిష్కారం చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే అప్పుడు ఉద్యోగులు దీనిపై తదుపరి ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications