తల్లికి వందనం డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటున్నారా ? ప్రభుత్వం క్లారిటీ..!
ఏపీలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీల్లో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా ఒక్కరికే తల్లి ఖాతాలో 15 వేల చొప్పున జమ చేసేవారు. దీంతో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికీ 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చాయి. తొలి ఏడాది ఇవ్వకపోయినా తాజాగా ఈ హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసిన తల్లికి వందనం పథకం డబ్బుల్ని తిరిగి వెనక్కి తీసేసుకుంటుందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లో ఇంకా విత్ డ్రా చేయకుండా ఉంటే వాటిని వెనక్కి తీసేసుకుంటారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

తల్లికి వందనం డబ్బులపై జరుగుతున్న ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించిన ప్రభుత్వం ఓ ఎక్స్ హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోను జత చేస్తూ క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది అని ఈ వ్యక్తి చెబుతున్న విషయం అబద్ధమంటూ ప్రభుత్వం తెలిపింది. మీ ఖాతాలో ఒకసారి జమ చేసిన సొమ్మును ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదని తెలిపింది. కాబట్టి లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన పడనక్కరలేదని తేల్చేసింది.

తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది అని ఈ వ్యక్తి చెబుతున్న విషయం అబద్ధం. మీ ఖాతాలో ఒకసారి జమ చేసిన సొమ్మును ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. కాబట్టి లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన పడనక్కరలేదు. (1/2) pic.twitter.com/Bntn3DMCm6
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 18, 2025
ప్రజలను ఆందోళనకు గురిచేసే ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని చేస్తున్న ఈ వ్యక్తిపై ప్రభుత్వం కేసు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటుందని కూడా హెచ్చరించింది. ఇటువంటి ఫేక్ పోస్టులను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం కోరింది. దీంతో తల్లికి వందనం పథకంపై జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications