YS Jagan Security: వైఎస్ జగన్ భద్రత తగ్గించారా ? సర్కార్ క్లారిటీ..!
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ వినుకొండ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా పోలీసులు ఆయన భద్రతను తగ్గించినట్లు వైసీపీ ఆరోపించింది. మాజీ సీఎం అయిన జగన్ కు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదని, దీంతో ఆయన మరో ప్రైవేట్ వాహనంలో వెళ్లాల్సి వచ్చిందని విమర్శించింది. తమ పార్టీ నేతల్ని సైతం జగన్ తో అనుమతించలేదని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై వివరణ ఇచ్చారు.

వినుకొండ పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు భద్రత తగ్గించినట్లు వస్తున్న వార్తలపై పోలీసు శాఖ స్పందించింది. అలాంటిదేమీ లేదని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చినట్లు వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని అధికారులు ఖండించారు. తనకు సౌలభ్యంగా లేకపోవడం వల్లే జగన్ మధ్యలో వాహనం మారినట్లు పేర్కొన్నారు. జగన్ కు ఇచ్చిన వాహనం పూర్తి కండిషన్ లోనే ఉందన్నారు.

జగన్ కు ఇచ్చిన కారు కండిషన్ లో లేకపోతే ఆ తర్వాత ఆయన కాన్వాయ్ లో దాన్ని ఎలా తీసుకెళ్లారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదన్నారు. జగన్ కు ఎల్లో బుక్ ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు తేల్చేసారు. దీంతో వైసీపీ నేతలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. మరోవైపు జగన్ వినుకొండ టూర్ సందర్భంగా కూడా ర్యాలీలు, సభలకు అనుమతి ఇవ్వకపోవడం కూడా శాంతిభద్రతల కారణంగానే అని పోలీసు అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications