వైజాగ్ స్టీల్ పై మా స్టాండ్ ఇదే.. ! తేల్చేసిన చంద్రబాబు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం మొదలుపెట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పలు మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది. అయితే కొంతకాలంగా కార్మికులు ఉద్యమాలు చేస్తుండటంతో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పరోక్షంగా మాత్రమే అడుగులు వేస్తోంది. కానీ తాజాగా వైజాగ్ లో సీఐఐ సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విషయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో విపక్ష వైసీపీ రంగంలోకి దిగిపోయింది.

ఉద్యోగులు తాము తీసుకుంటున్న వేతనాలకు న్యాయం చేయడం లేదని, ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు మాటల్ని వైసీపీ వక్రీకరిస్తోందంటూ నిన్న వివరణ ఇచ్చారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ఇవాళ నేరుగా ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తమ స్టాండ్ ఏంటో తేల్చేసింది.

AP Government Clarifies Vizag Steel Stand After Chandrababu Remarks Spark Backlash

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో నెలకొన్న అపోహల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఇందులో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరంచడం లేదని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని తెలిపింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని పేర్కొంది. తద్వారా స్టీల్ ప్లాంట్ కు మరింత సాయం అందిస్తామని క్లారిటీ ఇచ్చింది.

AP Government Clarifies Vizag Steel Stand After Chandrababu Remarks Spark Backlash

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 17 నెలల్లోనే వైజాగ్ స్టీల్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.15వేల కోట్ల సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్ కు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించింది.అలాగే ఓవరాల్ కెపాసిటీ యుటిలైజేషన్‌ను సైతం ఈ 17 నెలల్లో 48 నుంచి 79 శాతానికి పెంచినట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+