ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-నాలుగేళ్లలో ఇదే ఫస్ట్ ?
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆరంభంలోనే తమకు ఎన్నికల్లో అండగా నిలిచిన అన్ని పర్గాలను సంతృప్తి పరిచే పనిలో బిజీగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ జూలై1 న ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించడంతో పాటు సాయంత్రానికి 100 శాతం పూర్తి కావాలని టార్గెట్ కూడా పెట్టేసింది. ఇందుకోసం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా రోడ్లపైనే ఉన్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ ఇచ్చింది.
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీత భత్యాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ముఖ్యంగా అంతకు ముందు దశాబ్దాలుగా ఒకటో తేదీనే జీతాలు అందుకోవడానికి అలవాటుపడిన ఉద్యోగులకు నెలలో ఏదో ఒక సమయంలో జీతాలు చెల్లించే పరిస్ధితికి తీసుకొచ్చేసింది. గట్టిగా అడిగితే కేసులు పెట్టే పరిస్ధితులు కూడా ఉండటంతో ఉద్యోగులతో పాటు యూనియన్ల నేతలు కూడా గవర్నర్ ను ఆశ్రయించారు. దీనిపైనా వారికి వేధింపులు తప్పలేదు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వారికి గుడ్ న్యూస్ అందింది.

నాలుగేళ్లలో తొలిసారిగా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి. ఇవాళ దాదాపు అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నాలుగేళ్లలో ఇలా ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ కావడం ఇదే తొలిసారి అని కూడా చెప్తున్నాయి. దీంతో జీతాలు అందుకున్న ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఒకటో తేదీన జీతం వస్తుందన్న సంగతే మర్చిపోయామని, ఇప్పుడు ప్రభుత్వం మార్పు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications