లడ్డూ వివాదంపై సర్కార్ తొలి చర్య-ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసులు..! సిట్ కు బదిలీ ?
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు నేరుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తొలి చర్య చేపట్టింది. లడ్డూ కల్తీకి కారణమైన కల్తీ నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు సంస్థ ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు టీటీడీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏఆర్ ఫుడ్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.
టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీకృష్ణ .. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఏఆర్ డెయిరీ సంస్థపై నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ తిరుమల లడ్డూ తయారీ కోసం పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లభించినట్లు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులు పెట్టారు.

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఆవు నెయ్యి సేకరణ విధానం, నాణ్యత అంశాలను సమీక్షించి కారణాలు గుర్తించినట్లు ఫిర్యాదులో టీటీడీ పేర్కొంది. కల్తీ నెయ్యి వల్లే లడ్డూలో సువాసన, రుచి లేకుండా పోయినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో నెయ్యి నాణ్యత పెంచాలని సరఫరాదారులకు నోటీసులిచ్చి హెచ్చరికలు చేశామని, అయితే మిగతా సంస్ధలు నాణ్యత పెంచినా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ మాత్రం తమ తీరు మార్చుకోలేదని తెలిపింది.
ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25 తేదీల్లోనూ, జూలై 4వ తేదీన...ఇలా మొత్తం నాలుగు రోజుల్లో రోజుకు ఓ ట్యాంకర్ చొప్పున నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందని టీటీడీ తెలిపింది. అయితే తిరుమలలోని ల్యాబ్‌లో కల్తీ నిర్ధారణ అవకాశం లేకపోవడంతో గుజరాత్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామన్నారు. జూలై 16, 23 తేదీల్లో టీటీడీకి అందిన రిపోర్టుల్లో ఏఆర్ ఫుడ్స్ పంపిన నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. దీనిపై స్పందించిన ఏఆర్ ఫుడ్స్ తప్పు ఒప్పుకోలేదన్నారు. కాబట్టి కల్తీ నెయ్యి పంపిణీ చేసి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కూడా నేరానికి పాల్పడిందని నిర్ధారించినట్లు టీటీడీ తెలిపింది. దీంతో తిరుపతి పీఎస్ లో పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. వీటిని సిట్ కు బదిలీ చేయనున్నారు.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
తిరుమలలో వీటికి కొత్త పేర్లు- అందరి అంగీకారం? -
దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications