ఏపీలో సోషల్ పోస్టులపై కీలక నిర్ణయం..! లోకేష్ నేతృత్వంలో కమిటీ..!
ఏపీలో సోషల్ పోస్టుల రచ్చ కొనసాగుతూనే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మొదలైన సోషల్ పోస్టుల వ్యవహారం కూటమి సర్కార్ లోనూ కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు, విపక్షానికి వ్యతిరేకంగా అధికార పార్టీలు పోస్టులు పెడుతూనే ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత అంశాల ప్రస్తావన కూడా తప్పనిసరిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ పోస్టుల నియంత్రణకు ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్ధసారధి సభ్యులుగా సోషల్ మీడియా నియంత్రణకు సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ సోషల్ మీడియా జవాబుదారీతనం, కంటెంట్ నియంత్రణపై ఫోకస్ చేయబోతోంది. అలాగే తప్పుడు ప్రచారం, తప్పుదోవ పట్టించే సమాచారంపై నిఘా పెట్టనుంది.

సోషల్ మీడియా నియంత్రణకు అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలపైనా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తప్పుడు ప్రచారం, తప్పుదోవ పట్టించే సమాచారం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పోస్టులపై చర్యలకు సిఫారసులు చేయనుంది. అలాగే పౌర హక్కుల పరిరక్షణకు మంత్రుల కమిటీ సూచనలు కూడా ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం కూడా దీనికి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రుల కమిటీ సోషల్ మీడియా నియంత్రణపై తమ సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న సోషల్ పోస్టుల వ్యవహారంలో ఈ కమిటీ చేసే సూచనలు కీలకంగా మారబోతున్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం సోషల్ పోస్టుల నియంత్రణకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ తో పాటు వివిధ రూపాల్లో ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో కమిటీ చేసే సిఫార్సులపై ఉత్కంఠ నెలకొంది.
-
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications