ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్..! సెల్ఫ్ డిక్లరేషన్ తోనే..
ఏపీలో భవన నిర్మాణదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల కోసం గతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరిగి లంచాలు సమర్పించుకునే పరిస్ధితికి చెక్ పెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ ఈ మేరకు కీలక అడుగు వేసింది. భవన నిర్మాణదారుల కోసం కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెచ్చింది. అంతే కాదు ఇందులో భవన నిర్మాణదారులకు ఆటోమేటిక్ అనుమతుల కోసం అవకాశం కల్పిస్తోంది.
రాష్ట్రంలో ఇకపై 18 మీటర్ల ఎత్తు లోపు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం సరిపోతుందని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆప్షన్ ఇచ్చినట్లు ప్రకటన విడుదల చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో సంబంధం లేకుండా సరైన పత్రాలు సమర్పిస్తే ఆటోమెటిక్ గా అనుమతులు పొందవచ్చని మున్సిపల్ మంత్రి తెలిపారు.

వాస్తవానికి గత నెలలోనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసినా, సాంకేతిక కారణాలతో కొత్త విధానం అందుబాటులోకి రాలేదు.
ఇప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రావడంతో.. రిజిస్టర్డ్ ఇంజినీర్లు,ఆర్కిటెక్ట్ లు యజమానుల సమక్షంలో ఆన్ లైన్ లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే చాలని మున్సిపల్ మంత్రి తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన జారీ చేసేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. APDPMS పోర్టల్ లో ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అందుబాటులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications