మరో 70 అన్న క్యాంటీన్లకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎక్కడెక్కడంటే ?

అన్న క్యాంటీన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆకలితో బాధపడే పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందింస్తుంది కూటమి ప్రభుత్వం. కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తుంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌లు ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. మిగిలిన 62 నియోజకవర్గాల్లో కూడా వచ్చే జనవరి నుంచి వీటిని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొత్తగా మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకూ అన్న క్యాంటీన్‌లు విస్తరించనున్నాయి. ఈ 70 కొత్త క్యాంటీన్ల భవనాల నిర్మాణ పనులు సైతం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డిసెంబరు నాటికి వీటిని సిద్ధం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ap-government-green-signal-for-70-more-anna-canteens

అయితే ఒక్కో క్యాంటీన్ భవనానికి రూ.61 లక్షలు చొప్పున మొత్తం రూ.41.70 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జనవరి నుంచి ఈ కొత్త క్యాంటీన్‌లు అందుబాటులోకి రానుండగా వస్తాయి. కొత్తగా ప్రారంభించనున్న 70 క్యాంటీన్లతో ప్రభుత్వంపై ప్రజలకు అందించే భోజనంపై రాయితీ భారం.. ఏటా మరో రూ.45.07 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న 205 క్యాంటీన్లలో రోజూ మూడు పూటలా మొత్తం 1,84,500 మంది ఆహారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిపై మూడు పూటలా కలిపి రాయితీ కింద సుమారు రూ.75 ఖర్చు చేస్తోంది. అల్పాహారంపై రూ.17, మధ్యాహ్నం భోజనంపై రూ.29, రాత్రి భోజనంపై మరో రూ.29 చొప్పున ప్రభుత్వం భరిస్తోందని అధికారులు చెబుతున్నారు.

జిల్లా వారీగా కొత్తగా మంజూరు చేసిన అన్న క్యాంటీన్ల వివరాలు..

శ్రీకాకుళం: 5

పార్వతీపురం మన్యం: 1

విజయనగరం: 3

అల్లూరి సీతారామరాజు: 3

అనకాపల్లి: 3

అంబేడ్కర్ కోనసీమ: 3

తూర్పు గోదావరి: 4

పశ్చిమ గోదావరి: 3

కాకినాడ: 2

ఏలూరు: 4

గుంటూరు: 5

పల్నాడు: 1

ఎన్టీఆర్: 1

కృష్ణా: 3

ప్రకాశం: 4

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: 3

తిరుపతి: 2

చిత్తూరు: 7

అనంతపురం: 3

శ్రీ సత్యసాయి: 1

కర్నూలు: 4

నంద్యాల: 1

వైఎస్ఆర్ కడప: 1

అన్నమయ్య: 3

ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం వంటి నగరాల్లో 5-10 వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దాంతో కొత్తగా కేటాయించిన 70 క్యాంటీన్లను ఎక్కువగా గ్రామీణ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+