Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP DSC 2025: ఏపీ డీఎస్సీలో కీలక మార్పు..! ఆ రెండు పరీక్షల కొత్త తేదీలివే..!

ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకూ ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఇవాళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేసింది. రెండు పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు.

ap government has rescheduled dsc 2025 exam dates in wake of yoga day- here are details

ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు డీఎస్సీ కన్వీనర్ వెల్లడించారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC-2025 కన్వీనర్ శ్రీ ఎం.వికృష్ణారెడ్డి కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+