షాక్: భూసేకరణకు ఏపీ ప్రభుత్వం జీవో, అలా కాదని మంత్రి ట్విస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
2013 భూసేకరణ చట్టంలోని 2, 3 చాప్టర్ల నుంచి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ జీవో నంబర్ 166ను జారీ చేసింది. రాజధాని భూసేకరణకు ఈ మినహాయింపులు వెసులుబాటు కల్పించనున్నాయి.

దీంతో భూసేకరణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు అధికారాలు ఉంటాయి. భూసమీకరణకు ఇష్టపడని వారి భూములను ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుండి రేపటి నుండి భూములు సేకరిస్తారు.
కేంద్రం ఆర్డీనెన్స్ ఆధారంగా భూసేకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భూమిని సేకరించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఏప్రిల్ 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం పైన ఆర్డినెన్స్ జారీ చేసింది. రాజధాని కోసం భూమి కావాలని రెవెన్యూ శాఖను పట్టణాభివృద్ధి శాఖ కోరుతుంది.
నారాయణ ట్విస్ట్
భూసేకరణ బిల్లు రేపటి నుండి అమలులోకి రానుంది. ల్యాండ్ అక్విజేషన్ నోటీసు పైన మంత్రి నారాయణ మాట్లాడుతూ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఆర్డినెన్స్ భూసేకరణ కోరుకున్న వాళ్లకేనని చెప్పారు. ఇప్పటికి 60 శాతం పంటలు ఉన్నాయని, ఈ నెలాఖరున వేసవి పంట చేతికి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications