ఏపీలో రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్- కొత్త వాటి జారీ వేళ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే రేషన్ కార్డుల లబ్దిదారులకు సంబంధించి పూర్తి డేటాను సేకరించిన ప్రభుత్వం ఇందులో మార్పులు చేర్పులు చేసి రైస్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదీ ఏటీఏం కార్డుల తరహాలో స్మార్ట్ కార్డుల జారీ ఉండబోతున్నట్లు హింట్ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియలో మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రేషన్ కార్డుల నుండి సభ్యులను తొలగించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇకపై గతంలో చనిపోయిన వారు మాత్రమే కాదు, వలసల కారణంగా ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిన కుటుంబ సభ్యుల్ని కూడా రేషన్ కార్డుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ap government key update on members deletion in ration cards- here are details

ఇలా రేషన్ కార్డుల నుంచి కుటుంబ సభ్యుల్ని తొలగించేందుకు ప్రభుత్వం అధికారులకు కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. ఇందులో
వివాహం కారణంగా వేరే రాష్ట్రం/దేశానికి వలస వెళ్లిన వారు, ఉద్యోగరీత్యా వలస వెళ్లిన వారు, చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన వారు, ఇతర సాంకేతిక కారణాలతో కూడా ఈ తొలగింపులు చేపట్టవచ్చు. ఈ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయాలని సూచించింది. ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు అందులో తమ కుటుంబంలో స్ధానికంగా ఉండని వారి ఆధారాలు సమర్పించి వీరి పేర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+