ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై కీలక అప్డేట్..! మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన..!

ఏపీలో రైతుల నుంచి ఖరీఫ్ లో ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ కీలక వివరాలు వెల్లడించారు. విజయవాడలోని కానూరులో ఉన్న పౌరసరఫరాలశాఖ భవన్ లో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతులకు కూడా రికార్డు సమయంలో వీటి డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో నేటి వరకు 2 లక్షల 36 వేల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. గత ఏడాది తో పోల్చితే 36 శాతం అదనంగా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.గత ఏడాది ఈ సమయానికి లక్షా 81 వేల మెట్రిక్ టన్నులు సేకరించామని, ఈసారి భారీగా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో 16వేల మంది సిబ్బంది ఇందుకోసం పని చేస్తున్నారని ఆయన తెలిపారు.

ap government key update on paddy procurement and crediting amounts to farmers

గత ఏడాది 48 గంటల్లో రైతుల అకౌంట్స్ లో నగదు జమ చేస్తే, ఈ ఏడాది 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇప్పటి వరకు 560 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసామన్నారు. ఇప్పటి వరకు 32 వేల 793 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సారి 6 వేల 600 మంది కౌలు రైతుల నుంచి కూడా ధ్యానం కొనుగోలు చేశామన్నారు. రైతులు ఇబ్బందులు కలగకుండా అవసరమైన 6 కోట్ల 34 లక్షల గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామన్నారు.

ap government key update on paddy procurement and crediting amounts to farmers

అలాగే ధాన్యం సేకరణకు వాడుతున్న 32 వేల లారీలకు జీపీఎస్ అనుసంధానం చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. అలాగే 50 వేల టార్పాలిన్ లను సైతం సిద్ధం చేశామన్నారు. ఇందులో 19 వేల టార్పాలిన్లను రైతు సేవ కేంద్రాల ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+