Cotton Candy: ఏపీలో పీచు మిఠాయిపై నిషేధం ?

ఇన్నాళ్లూ పిల్లల్ని తన రుచితో ఊరించిన పీచు మిఠాయి ఇకపై అదృశ్యం కాబోతోందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి కారణం ఇందులు వాడుతున్న కృత్రిమ రంగులే. పీచు మిఠాయి తయారీలో సింథటిక్ రంగుల వాడకం కారణంగా క్యాన్సర్ తో పాటు పలు ప్రమాదకర రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందనే నివేదికలు ఏపీ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో తయారు చేస్తున్న పీచు మిఠాయి శాంపిల్స్ ను పరీక్షలకు పంపాలని నిర్ణయించింది.

సింథటిక్ తో పాటు ఇతర అనుమతి లేని రంగుల్ని పీచు పిఠాయి తయారీలో వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీచు మిఠాయి తయారీ కేంద్రాల నుంచి శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించింది. దీంతో వీరు పీచు మిఠాయి శాంపిల్స్ సేకరణ చేయనున్నారు. వీటిని ల్యాబ్స్ కు పంపి ప్రమాదకర రంగులు వాడుతున్నారో లేదో నిర్ధారించబోతున్నారు.

ap government likely to ban Cotton Candy soon, send samples for tests

ప్రస్తుతం పీచు మిఠాయి తయారీలో వాడుతున్న రంగులు క్యాన్సర్ కారకంగా తేలిందని ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ ఇవాళ తెలిపారు. దీంతో శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే పరీక్షల ఫలితాలు రావాలంటే నెల రోజుల సమయం పట్టొచ్చని ఆయన చెప్పారు. ఫలితాలు వచ్చాక వీటిని పరిశీలించి పీచు మిఠాయిపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+