Talliki Vandanam: ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం లేదా ? వెన్నుపోటు షురూ అన్న వైసీపీ..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేసిన తల్లులకు రూ.15 వేల పథకంలో మార్పులు చేసి తల్లికి వందనంగా మారుస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. జగన్ సర్కార్ ఇంట్లో స్కూలు కెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఈ పథకం అమలు చేయగా.. తాము మాత్రం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచాక ఈ పథకం అమలు గడువు దాటిపోతున్నా మార్గదర్శకాల పేరుతో ఆలస్యం చేస్తోంది.

దీనిపై నిన్న శాసనమండలిలో విద్యామంత్రి నారా లోకేష్ ను సభ్యులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన లోకేష్.. తల్లికి వందనం పథకం కూటమి ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అమలు చేస్తామని ప్రకటించారు. అయితే దీని విధివిధానాలు ఖరారవుతున్నాయని, ఇందులో హడావిడి అక్కర్లేదని వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామని తేల్చేశారు. దీంతో ఈ ఏడాది తల్లికి వందనం పథకం లేదని తేలిపోయింది. దీన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

ap government likely to implement talliki vandanam scheme from next year

అమ్మకు వందనం.. ఈ ఏడాది మాత్రం ఎగనామం! అంటూ వైసీపీ ఎక్స్ లో ట్వీట్ చేసింది. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15,000 తల్లుల ఖాతాలో వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ.. ఈ ఏడాది మాత్రం ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం. అధికారికంగా ప్రకటించిన నారా లోకేష్ అని తెలిపింది. అలాగే సూపర్-6 అమలులో చంద్రబాబు మార్క్ వెన్నుపోటు షురూ అంటూ విమర్శలు గుప్పించింది. దీనికి లోకేష్ మండలిలో మాట్లాడిన వీడియో కూడా జత చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+