పెథాయ్ తుపానుతో అలర్ట్.. సహాయకచర్యలకు సిద్ధం : చినరాజప్ప
Recommended Video

కాకినాడ : పెథాయ్ తుపానుతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉందని తెలిపారు హెం మినిస్టర్ చినరాజప్ప. తూర్పుగోదావరి జిల్లాలోని 14 మండలాలపై తుపాను ప్రభావం ఉండే ఛాన్సుందని తెలిపారు. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసరాలతో పాటు అవసరమైన అన్నింటినీ సిద్ధంగా ఉంచామన్నారు. తుపాను తీవ్రత ప్రకారం డెబ్బైకి పైగా నివాసిత ప్రాంతాల నుంచి జనాలను తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
అటు హెలికాప్టర్లు, భద్రతా బలగాలు సహాయకచర్యల కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెథాయ్ తుపాను దిశ మారుతోందని.. కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని ప్రకటించారు.

17 తుపాను ప్రభావిత మండలాల్లో సహాయక చర్యలు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల జాడ కనిపించడం లేదని సమాచారం వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమై వారిని సముద్రంలో ఉన్న రిగ్ దగ్గరకు సురక్షితంగా తరలించామని చెప్పారు. జిల్లాలో 60 వైద్య శిబిరాలు, 82 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications