Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ట్విస్టులు..! సర్కార్ ఆగ్రహం-విచారణ ?

ఏపీలో నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ సహా వీవీఐపీలందరినీ ఆహ్వానించిన ప్రభుత్వం.. వారిని సకాలంలో ప్రమాణస్వీకార వేదికకు చేర్చడంలో మాత్రం విఫలమైంది. దీంతో అధికారుల తీరుపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. దీనిపై ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.

నిన్న సీఎంగా చంద్రబాబు ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కేసరపల్లిలోని మేథాటవర్స్ పక్కన ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. కానీ అనుకున్న సమయానికి చంద్రబాబు వేదికపై ప్రమాణస్వీకారం మాత్రం చేయలేకపోయారు. దీంతో ఆయన వేదిక వెనుక ఉన్న గ్రీన్ రూమ్ లో అనుకున్న ముహుర్తానికే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరోసారి వేదికపై ప్రమాణం చేశారు.

ap government order inquiry on Chandrababu swearing-in ceremony delay with governor s late arrival

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక ఆలస్యం కావడం తో ప్రధాని మోదీ సమక్షంలో వేదిక వెనుకె గ్రీన్ రూములో 11 గంటల 27 నిముషాలకు చంద్రబాబు సంతకాలు చేశారు. గవర్నర్ కోసం 15 నిముషాల పాటు వేచి ఉన్న ప్రధాని మోదీ, చంద్రబాబు.. ఇక చేసేది లేక ఈ కార్యక్రమం పూర్తి చేసారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ వేదికకు ఆలస్యం గా చేరుకోవడం పై ప్రధాని మోడీ కూడా అరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

వాస్తవానికి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ముందుగానే గవర్నర్ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. కానీ గవర్నర్ కాన్వాయ్ కు ముందుగా ట్రయల్ రన్ నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందులో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టకుండా నేరుగా బయలుదేరడంతో గవర్నర్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి చంద్రబాబు ప్రమాణ ముహూర్త సమయానికి వేదిక వద్దకు రాలేకపోయారు. అంతేకాదు ప్రధానికి ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి కూడా చేరుకోలేక పోయారు.

ఈ ఘటనల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉందని తెలిసినా విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. దీంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని రెండు కిలోమీటర్ల మేర నడిచారు. దీంతో ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఆలస్యం, ట్రాఫిక్ చిక్కులపై అసంతృప్తి గా ఉన్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+