నా పైనా సర్వే చేయించుకుంటున్నా, నేను మారుతాను: బాబు (పిక్చర్స్)
విశాఖ: తప్పులు చేయకుండా ఉండటానికి తానేమీ అతీతుడిని కాదని, మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు పైన సర్వే జరిపిస్తున్నట్టుగానే నా పైన కూడా సర్వే చేయించుకుంటున్నానని, ప్రజలు నాలోని లోపాలు ఎత్తి చూపితే సరిదిద్దుకుని మారుతానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.
మన వెనుక ఏం జరుగుతోందో తెలుసుకునేందుకే ఈ సర్వేలు అని చెప్పారు. ఫలితాలు అనుకూలంగా లేవనుకోకుంటా, కారణాలు విశ్లేషించుకుని పని తీరు మార్చుకోవాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఇటీవలి సర్వేలో రెవెన్యూ, మునిసిపాలిటీలు, పోలీసు, ఆసుపత్రుల్లో అధిక అవినీతి జరుగుతోందని తేలిందన్నారు.
పింఛన్ల విషయమై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని గుర్తు చేశారు. ప్రతి నెలా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. కొత్తగా వచ్చిన మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తుండగా, సీనియర్లు ఈ విషయంలో విఫలమవుతున్నారన్నారు.
తన తప్పులు ఎత్తి చూపితే సరిదిద్దుకుంటానని, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలూ ఉండాలన్నారు. చంద్రబాబు మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రభుత్వ శాఖల పని తీరును సమీక్షించిన చంద్రబాబు... ఐటీ శాఖ పని తీరు బాగుందని కితాబిచ్చారు.

చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు బిజిబిజీగా గడిపారు. మంత్రులతో భేటీ అయ్యారు. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు.

చంద్రబాబు
సమాజంలో ఉపాధ్యాయులది సమున్నత స్థానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు.

చంద్రబాబు
సమాజంలో ఉపాధ్యాయుల స్థానం పవిత్రమైనదని, దానిని పెంచే విధంగా టీచర్ల బోధన ఉండాలని చంద్రబాబు సూచించారు.

చంద్రబాబు
ఏపీలో టీచర్ల కొరత లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు
ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా మానవ వనరులు భారత్ సొత్తని తెలిపారు. విద్యార్థులు సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, లక్ష్యం దిశగా సాగిపోవాలన్నారు.

చంద్రబాబు
సాంకేతికతను అందిపుచ్చుకుని, సరికొత్త లక్ష్యాలవైపు సాగిపోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి రగిలించారు.

చంద్రబాబు
2019 నాటికి వంద శాతం అక్షరాస్యతను సాధించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు
తప్పులు చేయకుండా ఉండటానికి తానేమీ అతీతుడిని కాదని, మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు పైన సర్వే జరిపిస్తున్నట్టుగానే నా పైన కూడా సర్వే చేయించుకుంటున్నానని, ప్రజలు నాలోని లోపాలు ఎత్తి చూపితే సరిదిద్దుకుని మారుతానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.

చంద్రబాబు
మన వెనుక ఏం జరుగుతోందో తెలుసుకునేందుకే ఈ సర్వేలు అని చెప్పారు. ఫలితాలు అనుకూలంగా లేవనుకోకుంటా, కారణాలు విశ్లేషించుకుని పని తీరు మార్చుకోవాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.

చంద్రబాబు
ఇటీవలి సర్వేలో రెవెన్యూ, మునిసిపాలిటీలు, పోలీసు, ఆసుపత్రుల్లో అధిక అవినీతి జరుగుతోందని తేలిందన్నారు.

చంద్రబాబు
పింఛన్ల విషయమై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని గుర్తు చేశారు. ప్రతి నెలా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు.

చంద్రబాబు
కొత్తగా వచ్చిన మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తుండగా, సీనియర్లు ఈ విషయంలో విఫలమవుతున్నారన్నారు.

చంద్రబాబు
తన తప్పులు ఎత్తి చూపితే సరిదిద్దుకుంటానని, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలూ ఉండాలన్నారు. చంద్రబాబు మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు
ప్రతి నెల ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రభుత్వ శాఖల పని తీరును సమీక్షించిన చంద్రబాబు... ఐటీ శాఖ పని తీరు బాగుందని కితాబిచ్చారు.

చంద్రబాబు
భారత దేశంలో ఒలింపిక్ ఆటల పోటీలు నిర్వహించాలన్నది తన కలగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు
విశాఖలో జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ గేమ్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చంద్రబాబు
గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో ఆప్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్, మిలటరీ గేమ్స్ నిర్వహించామన్నారు.

చంద్రబాబు
దేశంలో క్రికెట్‌తో పాటు మిగతా అన్ని క్రీడలనూ ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. ఏపీలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు
ఇండియా నుంచి ఒలింపిక్ ప్లేయర్లు తయారయ్యే దిశగా ఏపీ నాంది పలుకుతుందని చంద్రబాబు అన్నరాు. నైపుణ్యమున్న ఆటగాళ్లను వెలికితీసి వారికి మరింత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications