ఏపీలో త్వరలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు ? మంత్రి సంకేతం..
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం చూపడంతో పాటు వినియోగదారులు చెల్లించే ఛార్జీలను తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విద్యుత్ రంగం కూడా తీవ్ర ఇబ్బందులపాలైందని, దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఛార్జీలు భారీగా పెంచాల్సి వచ్చిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు. ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన్ వంటి పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవున్నట్లు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 6 నుంచి 7 శాతం పెరుగుతోందని, అందుకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే ఛార్జీలను అదుపులోకి తీసుకురావచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తిరుపతిలో మంత్రి వెల్లడించారు. 24 గంటల పాటు నిరంతరాయంగా వినియోగదారులకు విద్యుత్ అందిస్తామని ఆయన తెలిపారు.. అలాగే రైతులకూ నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications