TTD Board: 29 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు-జీవో జారీ-మార్పులివే..!
ఏపీలో ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. రెండు రోజుల క్రితం 24 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ అధికారులతో కలిపి మొత్తం 29 మందితో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ నాయుడు చైర్మన్ గా ఈ పాలక మండలి ఏర్పాటైంది.

ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జీవో ప్రకారం టీటీడీ కొత్త పాలక మండలికి టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడును ఛైర్మన్ గా నియమించారు. సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ప్రశాంతి రెడ్డి, ఎంఎస్ రాజు, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి, జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్, రాజమండ్రికి చెందిన అక్కిన ముని కోటేశ్వరరావు ఉన్నారు.
అలాగే మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, కర్నాటకకు చెందిన ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెల్.ఎల్.దత్తు, ఎం శాంతారాం, తమిళనాడుకు చెందిన రామ్మూర్తి, జానకీ దేవి తమ్మిశెట్టి, తెలంగాణకు చెందిన జనసేన నేతలు బొంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, పవన్ సన్నిహితుడు ఆనంద్ సాయి, తెలంగాణకు చెందిన సుచిత్రా ఎల్లా, కర్నాటకకు చెందిన నరేష్ కుమార్, గుజరాత్ కు చెందిన ఆదిత్ దేశాయ్, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ హెచ్ బోరా, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, తుడా ఛైర్మన్, టీటీడీ ఈవోను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇందులో నియమించారు.












Click it and Unblock the Notifications