రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. వీరికి పరిహారం కింద ప్రభుత్వం రూ.281 కోట్లను అందజేయనుంది. వీటిని మళ్లీ పంట వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఉపయోగించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల ఎకరాల్లో 1.87 లక్షల రైతులు వరదలవల్ల నష్టపోయారు. 2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ధాన్యం సేకరించే కేంద్రాలతోపాటు రైతు సేవా కేంద్రాలద్వారా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది.
37 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. క్వింటా కామన్ వెరైటీ రూ.2300, గ్రేడ్ ఏ రకానికి రూ.2320 చెల్లిస్తారు. ధాన్యాన్ని సేకరించడంతోపాటు మిల్లులకు సంబంధించిన ఆపరేషన్లను కూడా జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలు ధాన్యం కొనుగోళ్లకు నోడల్ ఏజెన్సీలు వ్యవహరించనున్నాయి. ధాన్యం కొనుగోలులో ఉన్న మిల్లర్లు ప్యాడీ ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ లో నమోదు కావాలని ప్రభుత్వం సూచించింది.

నిందితులపై చర్యలు
రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తంగా తయారైందని, బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. దీనిపై త్వరలోనే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. పౌరసరఫరాలశాఖకు సంబంధించి చోటుచేసుకున్న అవినీతిని ప్రక్షాళన చేస్తామని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై వేటు పడుతుందని హెచ్చరించారు. ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం అందించేందుకు గత ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించిన బకాయిలను కూడా ఇంతవరకు చెల్లించలేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications