ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ

ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ మంత్రి నారా లోకేష్ కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాలల్లో పనిచేస్తున్న కాపలాదార్లు, ఆయాలకు గత ప్రభుత్వం వేతనాలను ఇవ్వడంలేదని పెండింగ్ లో పెట్టిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి వారి వేతన బకాయిలను విడుదల చేయాలంటూ తాజాగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీటితోపాటు పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు అవసరమైన మెటీరియల్ ను కూడా అందివ్వనున్నారు.

రంగులు వేసి గాలికి వదిలేశారు
వాచ్ మెన్లు, ఆయాలకు సంబంధించిన వేతనాలు రూ.65 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు రూ.26 కోట్లు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా వీటికి సంబంధించిన జీవో కాపీలను మంత్రి లోకేష్ ట్విటర్ ఖాతాలో ఉంచారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పేరుతో రంగులు వేసి వేలకోట్ల రూపాయలు దిగమింగారని, పాఠశాలలకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించకుండా గాలికి వదిలేసి వెళ్లిపోయారని నారా లోకేష్ మండిపడ్డారు. పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే భావిభారత పౌరులు ఎలా తయారవుతారనే చిన్న విషయాన్ని కూడా వైసీపీ పాలకులకులకు తట్టలేదన్నారు. బకాయిల కింద ఉన్న మొత్తం సొమ్ములు విడుదల చేయడం జరిగిందన్నారు.

ap government released school maintenance fund and pending salaries

గౌరవ వేతనంకింద చెల్లిస్తారు
పాఠశాలలు సంఘ విద్రోహ శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాల ఆవరణలోని కీలకమైన పరికరాలను రక్షించేందుకు కాపలాదార్లను నియమించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణలో ఇతను పనిచేస్తాడు. పాఠశాల మూసివేసిన తర్వాత విధుల్లోకి చేరి తర్వాతరోజు స్కూల్ తెరిచేవరకు కాపలాదారు ఉంటారు. ఈ పోస్టులో స్థానికులనే నియమించాలనే నిబంధన ఉంది. టాయిలెట్ మెయింట్ నెన్స్ ఫండ్ నుంచి నెలవారీగా కాపలాదారుకు రూ.6వేల గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+