ఏపీ జైళ్లలో ఖైదీల ములాఖత్ లు ప్రారంభం-వ్యాక్సిన్ వేయించుకున్న వారికే కలిసే ఛాన్స్

ఏపీలోని జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేస్తుంటారు. కానీ కోవిడ్ నేపథ్యంలో ఖైదీల కుటుంబ సభ్యులు వారిని కలిస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో గతేడాది ములాఖత్ లు నిలిపేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించబోతున్నారు.

ఏపీలోని జైళ్లలో ఖైదీల ములాఖత్ లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ హసన్ రజా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లలోనూ ములాఖత్ లను నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ఖైదీల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గని నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఖైదీల కుటుంబ సభ్యుల్ని ఖైదీల్ని కలిసేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇబ్బందులు తప్పేలా లేవు.

ap government resume mulakhats in prisons today, only allow vaccinated family members

కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మార్చి నెలలో ప్రభుత్వం జైళ్లలో ములాఖత్ లను నిలిపేసింది. దీంతో అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వీల్లేక అటు ఖైదీలతో పాటు ఇటు వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఇరువురికీ మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ములాఖత్ లు తిరిగి ప్రారంభించేందుకు కసరత్తుచేసింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ నిబంధనతో ములాఖత్ కు అనుమతిస్తే చాలని అధికారులు నివేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

    RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Oneindia Telugu

    తాజా నిబంధనల ప్రకారం ఖైదీలతో నేరుగా మాట్లాడాలనుకునే కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధృవపత్రాన్ని జైలు అధికారులకు చూపిస్తే వారిని అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో అధికారులు ఈ మేరకు వ్యాక్సిన్ల ధృపపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+