ఏపీలో వరద బాధితులకు సర్కార్ గుడ్ న్యూస్-అకౌంట్లలో డబ్బులు ఎప్పుడంటే..?
ఏపీలో భారీ ఎత్తున వచ్చిన వరదలకు విజయవాడతో పాటు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. దీనిపై ఇప్పటికే నష్టం అంచనాలు సేకరించిన ప్రభుత్వం .. బాధితులకు అందించే సాయంపైనా ప్రకటన చేసింది. ఈ మేరకు వారికి పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. బాధితుల అకౌంట్లలోకి ఈ సాయాన్ని రేపు జమ చేయబోతున్నారు. ప్రతీ సచివాలయం పరిధిలోని గుర్తించిన వరద బాధితులకు ఈ సాయం అందనుంది.
విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద బాధితులకు సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. దుకాణాలు ధ్వంసమైన వారికి రూ.25 వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో బాధితులకు అందించే సాయంపై ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ఆధారంగా వరద సాయాన్ని బాధితుల అకౌంట్లలోకి జమ చేయనున్నారు. అయితే పలు చోట్ల కుటుంబాలు మ్యాపింగ్ కాకపోవడంతో వారికి సాయం అందించే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో వారు విజయవాడలో రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. వీరికి ఎలా సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications