ఏపీలో విద్యార్ధులకు నారా లోకేష్ అదిరిపోయే న్యూస్..! శనివారం పండగే..!

ఏపీలో విద్యార్ధులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే స్కూళ్లలో పలు విద్య సంస్కరణలు చేపడుతున్న లోకేష్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పుస్తకాల మోతతో సతమతం అవుతున్న విద్యార్ధులకు తాత్కాలికంగా ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం ఉంది. దీంతో విద్యార్ధులకు ప్రతీ వారం ఒక రోజు ఈ మోత నుంచి విముక్తి కలగబోతోంది.

ఏపీలో ఇకపై ప్రతీ శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రతీ నెలా మూడో శనివారం నో బ్యాగ్ డేగా అమలు చేస్తున్నారు. అయితే దీన్ని ప్రతీ శనివారానికి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెంటనే కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. అయితే ఇలా శనివారం నో బ్యాగ్ డే రోజు ఏయే కార్యక్రమాలు ఉంటాయో కూడా లోకేష్ వెల్లడించారు.

ap government to implement no bag day on every Saturday instead of third only says nara lokesh

శనివారం రోజు ప్రతీ పాఠశాలలోనూ విద్యార్ధులకు క్విజ్ లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యామంత్రి లోకేష్ తెలిపారు. దీంతో విద్యార్ధుల్లో సృజనాత్మకత కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. లోకేష్ నిర్ణయంపై విద్యార్ధులతో పాటు తల్లితండ్రుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న నెలకో శనివారం స్ధానంలో ఇలా ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయడం మంచిదేనన్న అభిప్రాయం విద్యావేత్తల్లోనూ వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+