వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ నెల 21నుంచి ఏపీలో భూముల సర్వే- విష ప్రచారం తిప్పికొట్టాలన్న జగన్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఈ నెల 21 నుంచి సమగ్ర భూముల సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏపీలో భూముల సర్వే జరిగి వందేళ్లు పూర్తయిపోయాయి. దీంతో తాజాగా భూముల సర్వే చేసి ప్రభుత్వ, ప్రైవేటు స్ధలాలు, ఇళ్లను డిజిటలైజ్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్వేకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సర్వేపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు పిలుపునిచ్చారు.

'వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం' పేరుతో నిర్వహిస్తున్న ఈ సర్వేపై వైయస్‌.జగన్‌ ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఇందులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌. సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం సహా ఇతర అధికారులు హాజరయ్యారు. డిసెంబర్‌ 21న ప్రారంభమయ్యే సమగ్ర సర్వే లో గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే జరపాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుండగా... మొదటి విడతలో 5 వేలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే జరగనుంది. 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో సర్వే నిర్వహిస్తారు. 2.26 కోట్ల ఎకరాల్లో ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూములూ సర్వే కానున్నాయి.

సర్వే తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు ఇస్తారు. ఈ కార్డులో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఉంటుంది. ప్రాపర్టీ (భూమి) కొలతలు, మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. దీంతో పాటు
క్యూ ఆర్‌ కోడ్‌ కూడా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వే పూర్తైన తర్వాత డిజిటైజ్డ్‌ కాడస్ట్రల్‌ మ్యాప్‌లు తయారు చేసి గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు అందులో ఉంచుతారు. భూ కొలతలు పూర్తైన తర్వాత వాటిలో సర్వే రాళ్లు పాతుతారు. గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్‌ రిజిస్టర్‌, వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు.

ap government to launch lands survey on 21st, jagan asked officials to clarify doubts

ఈ సర్వేలో పాల్గొనే అధికారులకు సర్వే ఆఫ్‌ ఇండియా శిక్షణ ఇస్తోంది. ప్రతి మండలానికి ఒక డ్రోన్‌ బృందం, డేటా ప్రాససింగ్‌ టీం, రీసర్వే టీం ఉంటాయని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకూ 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వారికీ త్వరలోనే శిక్షణ పూర్తవుతుందన్నారు. రేపు సర్వే ఆఫ్‌ ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఓ ఎంవోయూ కూడా కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థాయిలోనే రెవిన్యూ సర్వీసులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక గ్రామంలో సర్వే పూర్తై, మ్యాపులు సిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు అందనున్నాయి. ఆ మేరకు సచివాలయాల్లో ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న భూముల సర్వే ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని, దీనిపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించి, ఈ కార్యక్రమానికి అవాంతరాలు కలిగించేందుకు విషప్రచారాలు చేస్తున్న సందర్భాలు చూస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కాబట్టి సమగ్ర సర్వేపై కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. అనుమానాలకు దారి తీస్తున్న అంశాలకు గుర్తించి వారికి సరైన సమాచారం అందించాలన్నారు. కొన్ని పత్రికలు సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగేలా రాతలు రాస్తున్నాయని, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జగన్ సూచించారు.

English summary
andhra pradesh government to launch comprehensive lands survey in the state from decemeber 21st. cm jagan on tuesday holds a review in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X